Phalana Abbayi Phalana Ammayi Teaser: నటుడు, డైరెక్టర్ శ్రీనివాస్ అవసరాల సినిమాలన్నీ ఎంతో పొయిట్రీక్ గా ఉంటాయి. ఒక పక్క రియాలిటీని చూపిస్తూనే ఇంకోపక్క కవిత్వాన్ని జోడు చేసి అద్భుతమైన ప్రేమకథను చూపిస్తాడు. ఊహలు గుసగుసలాడే చిత్రం తరువాత నాగ శౌర్య- శ్రీనివాస్ అవసరాల కాంబోలో వస్తున్న చిత్రం ఫలానా అబ్బాయి- ఫలానా అమ్మాయి. ఈ చిత్రంలో నాగశౌర్య సరసన మాళవిక నాయర్ నటిస్తోంది. వీరిద్దరూ కలిసి కల్యాణ వైభోగమే చిత్రం తరువాత వస్తున్న చిత్రమిది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అప్పుడెప్పుడో ఈ సినిమా షూటింగ్ మొదలయ్యిందని చెప్పుకొచ్చారు. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ లేదు. ఇక తాజగా ఈ మధ్యనే ఒక కొత్త పోస్టర్ ను రిలీజ్ చేస్తూ నేడు టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. చెప్పినట్లుగానే కొద్దిసేపటి ముందు ఈ టీజర్ రిలీజ్ అయ్యింది. టీజర్ ను బట్టి శ్రీనివాస్ అవసరాల మార్క్ సినిమా అని అర్ధమవుతోంది.
Curly Hair Heroines: రింగురింగుల జుట్టుతో కుర్రాళ్లను రింగులో పడేసిన హీరోయిన్లు
“ఇందుమూలంగా ఎవత్ ప్రజానీకానికి తెలియజేయునది ఏమనగా సంజయ్ పీసుపాటి మరియు అనుపమ కస్తూరి బెస్ట్ ఫ్రెండ్స్ అహో” అంటూ మాళవిక నాయర్ చెప్పే డైలాగ్ తో టీజర్ మొదలయ్యింది. బెస్ట్ ఫ్రెండ్స్ మధ్య ప్రణయం, విరహం చూపించారు. సినిమాలో నటించడానికి ఈ ఇద్దరు ఫ్రెండ్స్ ఏం చేశారు. వారిద్దరి మధ్యకు వచ్చిన మూడో వ్యక్తిగా శ్రీనివాస అవసరాల కనిపించాడు. మరి అతని పాత్ర ఏంటి..? అనేది సినిమా చూడాల్సిందే. కథ మొత్తం తెలియకపోయినా టీజర్ ను బట్టి బెస్ట్ ఫ్రెండ్స్ మధ్య జరిగే ప్రేమకథగా తెలుస్తోంది. ఇక కళ్యాణ్ మాలిక్ సంగీతం అయితే ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తోంది. ఇక నాగశౌర్య లుక్ చూస్తుంటే ఊహలు గుసగుసలాడే సినిమా గుర్తురాకమానదు. క్లీన్ షేవ్ తో లవర్ బాయ్ లా కనిపించాడు. లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా హిట్ కొట్టేలా ఉన్నాడు శ్రీనివాస్ అవసరాల.. ఇకపోతే ఈ సినిమా మార్చి 17 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో ఈ కాంబోలు ఎలాంటి హిట్ ను అందుకుంటాయో చూడాలి.