సీనియర్ హీరోలలో హ్యాట్రిక్ హిట్స్ తో జెట్ స్పీడ్ లో దూసుకెళ్తున్నారు గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ. ప్రస్తుతం అయన తన 109వ చిత్రం బాబీ దర్శకత్వంలో ‘డాకు మహారాజ్’ సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికె విడుదలైన సాంగ్స్, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ, సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
జనవరి 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది డాకు మహారాజ్. అందులో భాగంగా చిత్ర ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు మేకర్స్. ఈ సినిమా విడుదలకు కేవలం నాలుగు రోజులు మాత్రమే ఉంది. కానీ ఇప్పటికి ఇంకా వర్క్ జరుగుతోంది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ డాకు మహారాజ్ ఫస్ట్ హాఫ్ ఆర్ ఆర్ ఫినిష్ చేసి లాక్ చేసేరు కానీ సెకండ్ హాఫ్ కు సంబంధించి ఇంకా వర్క్ పెండింగ్ ఉందట. దర్శకుడు బాబీ, తమన్ నిద్ర లేకుండా కంటిన్యూ గా ఈ వర్క్ ఫినిష్ చేసే పనిలో ఉన్నారట. ఇంకా రెండు రోజుల వర్క్ బ్యాలెన్స్ ఉందని గ్యాప్ లేకుండా వర్క్ చేస్తున్నామని దర్శకుడు బాబీ స్వయంగా నిన్న జరిగిన ప్రెస్ మీట్ ల్లో వెల్లడించారు. సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న గేమ్ ఛేంజర్ కు కూడా తమన్ మ్యూజిక్ చేస్తున్నాడు. ఆ సినిమా వర్క్ డిలే కారణంగా ముందు గేమ్ ఛేంజర్ ఫినిష్ చేసి, ఇప్పుడు డాకు మహారాజ్ వర్క్ స్టార్ట్ చేసాడు తమన్. రెండు రోజుల్లో టోటల్ వర్క్ ఫినిష్ చేయాల్సి ఉంది.