Payal Rajput : బోల్డ్ అండ్ కాన్ఫిడెంట్ నటిగా పేరు తెచ్చుకున్న పాయల్ రాజ్‌పుత్ మరోసారి షాకింగ్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. తాజాగా ఆమె ఓ ఇంగ్లిష్ పేపర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శృంగారం గురించి ఓపెన్ గా తన అభిప్రాయాలను పంచుకుంది. తన సినిమాల్లో బోల్డ్ సీన్లు ఎక్కువగా ఉండటంపై వచ్చిన ప్రశ్నకు పాయల్ సమాధానమిస్తూ “శృంగారం అనేది జీవితం లో భాగం. దీని గురించి మాట్లాడటానికి సిగ్గు పడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరూ దీన్ని నార్మల్ మ్యాటర్ గా తీసుకోవాలి” అని చెప్పింది. అలాగే, సమాజంలో సెక్స్ ఎడ్యుకేషన్ ఎంత ముఖ్యమో కూడా ఆమె ప్రస్తావించింది. “ప్రతీ వ్యక్తి సరైన అవగాహన కలిగి ఉండాలి.
Read Also : Prabhas : ప్రభాస్ సెంటిమెంట్ దుల్కర్ కు కలిసొస్తుందా..?
ముఖ్యంగా యువతకు సెక్స్ ఎడ్యుకేషన్ తప్పనిసరి. పీరియడ్స్ సమయంలో అమ్మాయిలు ఎదుర్కొనే ఫిజికల్ ఇష్యూస్, మానసిక ఇబ్బందుల గురించి సినిమాల్లో చూపించడం ద్వారా కొంత అవగాహన కల్పించాలనే ప్రయత్నం చేశాను. కండోమ్ వాడకం, సేఫ్టీ శృంగార జీవితం గురించి కూడా తన సినిమాల ద్వారా సందేశం ఇవ్వాలనుకున్నట్టు పాయల్ పేర్కొంది. “ఇలాంటి విషయాలు దాచిపెట్టడం కంటే ఓపెన్‌గా చర్చించడం ద్వారా సమాజం మరింత అవగాహన పొందుతుంది” అని ఆమె చెప్పింది.
Read Also : Chiranjeevi – Ram Charan : మొన్న చిరంజీవి.. నేడు రామ్ చరణ్.. అదరగొట్టారుగా..