Pawan Kalyan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నేడు తన 38 వ పుట్టినరోజును జరుపుకుంటున్న విషయం తెల్సిందే. నేడు చరణ్ బర్త్ డే కావడంతో సోషల్ మీడియా.. ఆయన బర్త్ డే విషెస్ తో మోత మ్రోగిపోతుంది. అభిమానులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు సైతం చరణ్ కు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. ఇక తాజాగా చరణ్ బాబాయ్, నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. అన్న కొడుకుకు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. చిన్నతనం నుంచి చరణ్.. బాబాయ్ పవన్ దగ్గరే పెరిగాడు. ఎన్నోసార్లు ఈ విషయాన్ని ఇద్దరు ఎన్నో స్టేజిలపై గుర్తుచేసుకున్నారు. చరణ్ చిన్నప్పుడు.. పవన్ దగ్గరే ఉండేవాడు. చిరు షూటింగ్ కు వెళ్లడం, వదిన సురేఖ ఇంటిపనులతో బిజీగా ఉండడంతో చరణ్ డ్యూటీ తనకు అప్పజెప్పేవారని పవన్ చెప్పుకొచ్చాడు. అలా పెరిగిన తన కొడుకు.. ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా ఎదిగిన వైనాన్ని పవన్ చెప్పుకొచ్చాడు. ఇంకా ఇంకా ఉన్నత స్థాయిలో చరణ్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు.
Sriram movies: ఉదయ్ శంకర్, మేఘా ఆకాశ్ జంటగా కొత్త సినిమా!
“అంతర్జాతీయ స్థాయి ప్రశంసలు పొందేలా ఎదిగిన రామ్ చరణ్ కి ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. స్నేహభావంతో మెలిగే చరణ్ మరెన్నో విజయాలు అందుకొని ఎదగాలని, అందరి మన్ననలూ అందుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. దైవ చింతన, ప్రశాంత చిత్తం కలిగిన చరణ్ కి ఉన్న క్రమశిక్షణ, వృత్తి పట్ల నిబద్ధత ఆయుధాల్లాంటివి. కచ్చితంగా భవిష్యత్తులో మన సినిమా కీర్తి పతాకాన్ని ఎగురవేసే మంచి చిత్రాలను తను అందిస్తాడని ఆశిస్తున్నాను” అంటూ ట్విట్టర్ లో రాసుకొచ్చారు పవన్. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ ట్వీట్ చూశాక అబ్బాయ్ పై బాబాయ్ ప్రేమ చూస్తుంటే భలే ముచ్చటేస్తుందే అని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.