Megha Akash: శ్రీరామ్ మూవీస్ బ్యానర్ పై ఉదయ్ శంకర్ హీరోగా రెండో సినిమా ప్రారంభమైంది. మన్మోహన్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ డాక్టర్ సౌజన్య ఆర్. అట్లూరి సమర్పణలో అట్లూరి నారాయణ రావు దీనిని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఉదయ్ శంకర్ సరసన ప్రముఖ కథానాయిక మేఘా ఆకాశ్ నటిస్తోంది. ముహూర్తపు సన్నివేశానికి శ్రీరామ్ సార్ క్లాప్ ఇవ్వగా, దినేష్ చౌదరి కెమెరా స్విచ్చాన్ చేశారు. ఈ సందర్భంగా నటుడు మధునందన్ మాట్లాడుతూ, “నారాయణరావు గారు నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్న మన్మోహన్ నా సొంత బ్రదర్. ఈ అవకాశం ఇచ్చిన నారాయణ రావుగారికి థ్యాంక్యూ. ఇదే బ్యానర్ లో మరోసారి ఉదయ్ హీరోగా నటిస్తుండటం హ్యాపీగా ఉంది. ఉదయ్ కి ఈ చిత్రం సూపర్ హిట్ ఇస్తుందని చెప్పగలను. ఎందుకంటే ఈ స్క్రిప్ట్ మొత్తం నేను చదివాను. అందుకే ఉదయ్ కి మంచి హిట్ ఇవ్వడంతో పాటు అతన్ని నెక్ట్స్ లీగ్ లోకి తీసుకువెళుతుంది” అని అన్నారు.
హీరో ఉదయ్ శంకర్ మాట్లాడుతూ, “హీరోగా నాకు ఇది ఐదో సినిమా. ఈ బ్యానర్ లో రెండో సినిమా. నిర్మాత నారాయణరావుగారితో మరోసారి అసోసియేట్ కావడం చాలా హ్యాపీగా ఉంది. ఓ రకంగా ఇది ఫ్యామిలీ ప్రాజెక్ట్ లాంటిదే. ‘నచ్చింది గర్ల్ ఫ్రెండ్’ తర్వాత మధునందన్ తో కలిసి నటించడం సంతోషంగా ఉంది. ఈ మూవీలో అతనికి చాలా ఇంపార్టెంట్ రోల్. హిలేరియస్ గా సాగే ఎగ్జైటింగ్ క్యారెక్టర్ చేస్తున్నాడు. మధునందన్ బ్రదర్ మన్మోహన్ తన డెబ్యూ మూవీతో అద్భుతమైన స్క్రిప్ట్ తో వచ్చాడు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం ఉంటుంది. అతి త్వరలోనే రెగ్యులర్ షూట్ కు వెళ్లబోతున్నాం” అని అన్నారు.
దర్శకుడు మన్మోహన్ మాట్లాడుతూ, “ఇందులో ఫ్యామిలీ, థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో పాటు ఒక చిన్న ప్రేమకథ కూడా మిక్స్ అయి ఉంటుంది. మీ అందరికీ ఈ కథ నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఈ మొత్తం జర్నీలో మీ అందరి సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను” అని అన్నారు. నిర్మాత నారాయణరావు మాట్లాడుతూ… “శ్రీరామ్ మూవీస్ ప్రొడక్షన్ నెంబర్ 2 కూడా ఉదయ్ తోనే మొదలు పెడుతున్నందుకు సంతోషంగా ఉంది. మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన మా గురువు గారు శ్రీరామ్ సార్ కీ, నా మిత్రుడు దినేష్ చౌదరికీ, మీడియా మిత్రులకు ధన్యవాదాలు. ఈ మూవీ కథ చాలా బావుంటుంది. స్క్రిప్ట్ ఎక్స్ ట్రార్డినరీగా ఉంది. ఉదయ్ శంకర్ తో పాటు హీరోయిన్ మేఘా ఆకాశ్ పాత్రలు చాలా బావుంటాయి. మ్యూజిక్ శ్రీ చరణ్ పాకాల, సినిమాటోగ్రఫీ ‘జాంబిరెడ్డి’ ఫేమ్ అనిత్ కుమార్ అందిస్తున్నారు. మంచి కాస్ట్ అండ్ క్రూతో వస్తున్న ఈ చిత్రం మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను” అని అన్నారు.