ఓ వైపు సినిమాలు.. మరో వైపు రాజకీయంగా.. ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అయితే మళ్లీ కొన్నాళ్లు సినిమాలను పక్కకు పెట్టేసి.. పూర్తిగా పొలిటికల్ పైనే దృష్టి సారించాలి అనుకుంటున్నారట. ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలా భాగం షూటింగ్ జరుపుకున్న తన కొత్త సినిమాకు డెడ్ లైన్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అలా జరగకపోతే.. నెక్ట్స్ స్టెప్ తీసుకోవాల్సి ఉంటుందని.. చెప్పారట.. మరి పవన్ డెడ్ లైన్ ఎప్పటి వరకు..!
రీ ఎంట్రీ తర్వాత పవన్ చేసిన వకీల్ సాబ్, భీమ్లానాయక్.. రెండు రీమేక్ సినిమాలు బ్లాక్ బస్టర్‌గా నిలిచాయి. దాంతో మరో రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు. తమిళ్ హిట్ మూవీ వినోదయ రీమేక్ చేసేందుకు.. పవన్ గ్రీన్ ఇచ్చినట్టు చాలా రోజులుగా వినిపిస్తోంది. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే దీనికంటే ముందు షూటింగ్ చివరి స్టేజ్‌లో ఉన్న హరిహర వీరమల్లు కంప్లీట్ చేయాల్సి ఉంది. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమ షూటింగ్ స్టార్ట్ అయి చాలా కాలం అవుతోంది. మధ్యలో కోవిడ్‌తో షూట్ ఆగిపోవడం ఒకటైతే.. పవన్ డేట్స్ దొరక్క కొంత డిలే అవుతూ వస్తోంది. దాంతో ఈ ప్రాజెక్ట్ పై రకరకాల వార్తలొస్తున్నాయి. అయితే తాజాగా పవన్ ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలనుకుంటున్నారట. వీలైనంత త్వరగా ఈ సినిమాను పూర్తి చేయాలని మేకర్స్‌కు డెడ్ లైన్ పెట్టినట్లు తెలుస్తోంది. ఆగస్టులోగా తనకు సంబంధించిన సీన్స్ కంప్లీట్ చేయాలని.. లేదంటే ఆ తరువాత వేరే సినిమాకి తన కాల్షీట్స్ ఇచ్చేస్తానని అన్నారట. ఇక ఆ తర్వాత వినోదయ సీతమ్ రీమేక్ పూర్తి చేసి.. అక్టోబర్ నుంచి పొలిటికల్ టూర్ వెళ్ళాలని డిసైడ్ అయ్యారట. ఆ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘భవదీయుడు భగత్‌సింగ్’ మొదలు పెట్టబోతున్నారట. ఏదేమైనా.. ఎట్టి పరిస్థితుల్లోను వచ్చే ఎన్నికల్లోపు.. పవన్ కమిట్ అయిన సినిమాలను కంప్లీట్ చేయాలని భావిస్తున్నారని చెప్పొచ్చు.