టాప్ హీరోల సినిమాలు ఆది నుంచీ అంతం దాకా క్రేజీగానే సాగుతుంటాయి. ఇక ఇప్పుడు పవన్ , రానా మల్టీ స్టారర్ టాలీవుడ్ లో పెద్ద హాట్ టాపిక్ గా మారిపోయింది. మలయాళ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోశియమ్’ రీమేక్ గా తెలుగు తెరపైకి వస్తోన్న సినిమాకి జనాల్లో ఆసక్తికేం కొదవలేదు. అయితే, పవర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం ఓ రేంజ్లో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే, ‘గబ్బర్ సింగ్’ తరువాత మరోసారి పోలీస్ వేషంలో దర్శనమిచ్చాడు పీకే! ఆ లుక్ తోనే మరింత జోష్ పెరిగింది అభిమానులకి…
పీఎస్ పీకే, రానా మూవీకి మరింత హైప్ క్రియేట్ చేస్తూ డైరెక్టర్ సాగర్ చంద్ర లెటెస్ట్ గా ట్వీట్ ఒకటి చేశాడు. అందులో ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే సందర్భంగా అప్ డేట్ ఉంటుందని ప్రకటించాడు. ‘పవర్ స్ట్రామ్’ ఉదయం 9.45 కి వచ్చేస్తుందంటూ గుడ్ న్యూస్ చెప్పాడు. రేపు పవన్ మూవీ టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ విడుదల కావచ్చని అంటున్నారు. ఎగ్జాక్ట్ గా ఎటువంటి సర్ ప్రైజ్ ఉంటుందో చూడాలి మరి. సినిమా టైటిల్, హీరో కళ్యాణ్ క్యారెక్టర్ నేమ్… రెండూ ‘భీమ్లా నాయక్’ అనే ఉంటాయని కూడా టాక్ వినిపిస్తోంది. అందులో నిజమెంతో తెలియాలంటే ఆగస్ట్ 15, 9.45 ఏఎమ్ దాకా వెయిట్ చేయాల్సిందే…