Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- సాయి ధరమ్ తేజ్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన చిత్రం బ్రో. సముతిరఖని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న విషయం తెల్సిందే. ఇక తాజాగా విశ్వ ప్రసాద్ తల్లి గీతాంజలి మృతి చెందిన విషయం తెల్సిందే. గత కొన్నిరోజులుగా వయో వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె చివరి కోరిక మేరకు వారణాసి తీసుకెళ్లగా.. ఆ కోరికను నెరవేరగానే నేటి సాయంత్రం ఆమె మృతి చెందింది. దీంతో విశ్వ ప్రసాద్ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఇక విశ్వ ప్రసాద్ తల్లి మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. తాజాగా పవన్ కళ్యాణ్ సైతం గీతాంజలి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశాడు.
Sobitha Dhulipala: నాగ చైతన్య రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ శృంగారం సీన్స్.. మరీ ఇంత ఘాటుగానా
“ప్రముఖ సినీ నిర్మాత శ్రీ టి.జి.విశ్వ ప్రసాద్ గారి మాతృమూర్తి శ్రీమతి గీతాంజలి గారు శివైక్యం చెందారని తెలిసి చింతించాను. గీతాంజలి గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. శ్రీ విశ్వ ప్రసాద్ గారికి, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను” అని తెలిపాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. వారణాసిలోనే ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు విశ్వ ప్రసాద్ కుటుంబ సభ్యులు తెలిపారు.
శ్రీమతి టి.జి.గీతాంజలి గారు ఆత్మకు శాంతి చేకూరాలి – JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/4USrfqGfmX
— JanaSena Party (@JanaSenaParty) June 30, 2023