Param Sundari Trailer : గ్లామర్ బ్యూటీ జాన్వీకపూర్ మరో సినిమాతో రాబోతోంది. బాలీవుడ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా, జాన్వీకపూర్ జంటగా వస్తున్న లేటెస్ట్ మూవీ పరమ్ సుందరి. ఈ సినిమాను తుషార్ జలోటా డైరెక్ట్ చేయగా.. దినేశ్ విజన్ ప్రొడ్యూస్ చేశారు. తాజాగా మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇందులో మలయాళ కుట్టిగా జాన్వీకపూర్ సందడి చేసింది. నార్త్ కు చెందిన అబ్బాయి, సౌత్ కు చెందిన అమ్మాయి మధ్య ప్రేమ పుడితే ఎలా ఉంటుందో ఈ సినిమా ఆ కోణంలోనే ఉన్నట్టు తెలుస్తోంది. ట్రైలర్ అందుకు తగ్గట్టే కాస్త ఫన్నీగా, ట్రాజెడీగా కట్ చేసి రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లో మరో విషయం కూడా ఉంది.
Read Also : SSMB 29 : సింహంతో మహేశ్ బాబుకు సీన్స్.. కార్తికేయ పోస్టు వైరల్
ఇందులో రజినీకాంత్, అల్లు అర్జున్ లను ఇమిమేట్ చేసింది జాన్వీకపూర్. ఆగస్టు 29న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఇప్పటికే వచ్చిన పాటలు బాగానే ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ట్రైలర్ తో అంచనాలు పెంచే ప్రయత్నం చేశారు. తెలుగు నాట జాన్వీకి మంచి మార్కెట్ ఏర్పడింది. దేవర సినిమాతో భారీ క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు పెద్ది సినిమాలో నటిస్తోంది. ఆమెకు ఉన్న మార్కెట్ వల్లే ఈ పరమ్ సుందరి సినిమాకు తెలుగు నాట మంచి బిజినెస్ ఏర్పడుతోంది. ఇది యూత్ ఫుల్ లవ్ అండ్ ఎంటర్ టైనర్ కోణంలో కనిపిస్తోంది.
Read Also : Sai Durga Tej : నాకు ఆమెనే గుర్తొస్తోంది.. సాయిదుర్గాతేజ్ ఫన్నీ కామెంట్స్
