Pabhas Salaar Ceasefire to be Released In Record Breaking Centers at North America: ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సలార్’. ఈ సినిమాని రెండు భాగాలుగా ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నట్టు తెలుస్తోంది. అయితే అందులో మొదటి భాగాన్ని ‘Ceasefire’ పేరుతో సెప్టెంబర్ 28న రిలీజ్ చేయబోతున్నారు. ఇటీవలే ఈ మూవీ నుంచి టీజర్ ని రిలీజ్ చేయగా యూట్యూబ్ లో రికార్డులు సృష్టించగా ఆ టీజర్ తో ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే టాలీవుడ్ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు తెలుగు రాష్ట్రాల్లోనే ఈ మూవీ 200 కోట్ల వరకు ధర పలికినట్లు సమాచారం. ఇలా ప్రతి విషయంలో ఈ మూవీ రికార్డు క్రియేట్ చేసుకుంటూ వెళ్తుండగా తాజాగా ఈ మూవీ అమెరికాలో ఒక సరికొత్త రికార్డు నెలకొల్పింది. అదేమంటే ఇప్పటివరకు అమెరికాలో ఏ ఇండియన్ సినిమా రిలీజ్ కానని సెంటర్స్ లో ఈ సినిమా విడుదల కాబోతుందని అధికారిక ప్రకటన వచ్చింది.
Hatya Pre Release event: మా రాతను మేమే రాసుకున్నాం.. కాస్త గుర్తుంచుకోండి: అడివి శేష్
నార్త్ అమెరికా మొత్తం మీద సుమారు 1979 లొకేషన్స్ లో ఈ మూవీ రిలీజ్ కాబోతుందని టాక్. అమెరికాలో ఒక ఇండియన్ సినిమా ఈ రేంజ్ లో రిలీజ్ కావడం ఆల్ టైం రికార్డు అంటున్నారు సినీ విశ్లేషకులు. ఈమేరకు అక్కడ సినిమాను రిలీజ్ చేస్తున్న ప్రత్యంగిరా ఫిలిమ్స్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. కేవలం రిలీజ్ చేసిన ఒక్క టీజర్ తోనే ఈ మూవీ పై ఇంతటి క్రేజ్ వచ్చిందంటే ఆగష్టులో ఈ మూవీ ట్రైలర్ ని కూడా రిలీజ్ అయితే ఇక వేరే లెవల్ లో ఉంటుందని చెప్పక తప్పదు.. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంటే మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు విలన్స్ గా కనిపించబోతున్నారు. శ్రియా రెడ్డి, టిన్ను ఆనంద్, ఈశ్వరి రావు తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ మీద దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ తో విజయ్ కిరగందూర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
A grand salute from our side to the 𝘽𝙤𝙭 𝙊𝙛𝙛𝙞𝙘𝙚 𝘽𝙪𝙡𝙡𝙙𝙤𝙯𝙚𝙧…. Marking the Man’s birthday year with the locations we are releasing in North America.
PRABHAS 🔥🔥🔥💥💥
1979 Locations – ALL TIME RECORD RELEASE FOR ANY INDIAN FILM. #Salaar 💥 #SalaarCeaseFire… pic.twitter.com/ynw3jZOirR
— Prathyangira Cinemas (@PrathyangiraUS) July 17, 2023