Vijay Antony Hatya Movie Pre Release event at Hyderabad: తమిళ హీరో విజయ్ అంటోని నటిస్తున్న కొత్త సినిమా ‘హత్య’ ప్రీ రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా జరగగా యంగ్ హీరోలు అడివి శేష్, సందీప్ కిషన్ అతిథులుగా హాజరయ్యారు. క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్‌లో దర్శకుడు బాలాజీ కుమార్ ఈ సినిమాను తెరకెక్కించగా ఈ నెల 21న గ్లోబల్ సినిమాస్, సురేష్ ప్రొడక్షన్ ద్వారా తెలుగులో విడుదలవుతోంది. ఈ సినిమాలో విజయ్ ఆంటోని డిటెక్టివ్ పాత్రలో కనిపించనుండగా రితికా సింగ్, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటించారు. లోటస్ పిక్చర్స్, ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ బ్యానర్స్ పై కమల్ బోరా, జి.ధనుంజయన్, ప్రదీప్ బి, పంకజ్ బోరా, విక్రమ్ కుమార్, తాన్ శ్రీ దొరైసింగం పిళ్లై, సిద్ధార్థ్ శంకర్, ఆర్‌విఎస్ అశోక్ కుమార్ గ్రాండ్ గా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు బాలాజీ కుమార్ మాట్లాడుతూ 1923లో జరిగిన ఓ ఘటన ఆధారంగా హత్య చిత్రాన్ని రూపొందించానని, మా కంటే థియేటర్ లో మా సినిమా మాట్లాడితే బాగుంటుందని అన్నారు ఒక మంచి థ్రిల్లర్ మూవీగా మిమ్మల్ని ఆకట్టుకుంటుందని ఆయన అన్నారు. అతిథిగా విచ్చేసిన హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ విజయ్ ఆంటోనీ గారు సెలెక్ట్ చేసుకునే సబ్జెక్ట్స్ చాలా బాగుంటాయని, డిఫరెంట్ స్టోరీస్ తో సాధారణ ప్రేక్షకులకు నచ్చేలా రూపొందిస్తుంటారని అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్నప్పటి నుంచే విజయ్ గారి పాటలకు నేను అభిమానినని అన్నారు. మీనాక్షి చౌదరి అడుగుపెట్టిన ప్రతిచోటా సక్సెస్ అందుకుంటోందన్న ఆయన హత్య టీమ్ కు బెస్ట్ విషెస్ తెలిపారు. హీరోయిన్ మీనాక్షి చౌదరి మాట్లాడుతూ తాను చేసిన మొదటి సినిమా ఇదేనని ఈ సినిమాలో లైలా పాత్రలో నటిస్తున్నానని అన్నారు. ఈ క్యారెక్టర్ లో నటిస్తున్నప్పుడు నన్ను నేను మర్చిపోయి లైలాగా మారానని పేర్కొన్న ఆమె ఈ సినిమా నాకొక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అని అన్నారు. ఈ సినిమాతో నన్ను మరింత ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నానని పేర్కొన్న ఆమె మహేశ్ బాబు గారి గుంటూరు కారం సినిమాలో ఓ కీ రోల్ చేస్తున్నానని ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేశామని అన్నారు.
హీరో అడివి శేష్ మాట్లాడుతూ – విజయ్ గారి బిచ్చగాడు 2 ఫంక్షన్ కు గెస్ట్ గా వచ్చానని, ఆ సినిమా సక్సెస్ అయ్యింది అందుకే ఇప్పుడు హత్య సినిమాకు అతిథిగా రమ్మన్నారని అన్నారు. ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే తెలుగు సినిమా, తమిళ సినిమాలా లేదు ఇంటర్నేషనల్ ఫిల్మ్ లా ఉందని పేర్కొన్న ఆయన దర్శకుడు బాలాజీ గారు ..మీ నెక్ట్ సినిమాలో హీరోను సెలెక్ట్ చేసుకునే ముందు నా గురించి ఆలోచించండని అన్నారు . ఇక్కడున్న సందీప్, మీనాక్షి, విజయ్ ఆంటోనీ, నేను మేమంతా స్వతహాగా ఎదిగిన వాళ్లమని మా రాతను మేమే రాసుకున్నామని అన్నారు. ప్రేక్షకులు ఈ సినిమాకు సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నానని ఆయన అన్నారు.
ఇక హీరో విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ అడివి శేష్ మా సినిమాలకు లక్కీ మస్కట్ లాంటి వారని, సందీప్ మార్నింగ్ షూటింగ్ చేసి ఇక్కడికి వచ్చారని అన్నారు. డైరెక్టర్ బాలాజీ గారితో శేష్, సందీప్ ఇద్దరూ సినిమాలు చేయాలని కోరుకుంటున్నానని పేర్కొన్న ఆయన అతను మంచి టెక్నీషియన్ అని ఫిల్మ్ మేకింగ్ లో బాలాజీ గారికి పూర్తి అవగాహన ఉందని అన్నారు. ఈ సినిమా మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వింటే హాలీవుడ్ డిటెక్టివ్ మూవీస్ గుర్తొస్తాయని పేర్కొన్న ఆయన గిరిష్ అంత మంచి మ్యూజిక్ ఇచ్చారని అన్నారు. అందుకే మా ఈ హత్య సినిమాను సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నానని అన్నారు.