Oke Oka Jeevitham: వైపుంగ్ హీరో శర్వానంద్, రీతూ వర్మ జంటగా శ్రీ కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఒకే ఒక జీవితం. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ్ భాషల్లో సెప్టెంబర్ 9 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇరాక్ తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో అక్కినేని అమల ఒక ముఖ్య పాత్రలో నటిస్తోంది. టైమ్ ట్రావెల్ కథగా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది. ఆది, శ్రీను, చైతు ముగ్గురు చిన్నపాటి నుంచి స్నేహితులు. ఆది ఒక సింగర్ కావాలనుకొంటాడు. అతని తల్లి చిన్నతనంలోనే మృతిచెందడం వలన అతనికి మ్యూజిక్ మీద దృష్టి ఉండదు. ఎప్పుడు ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఈ నేపథ్యంలోనే ఒక సైంటిస్ట్ చూసే అవకాశం లభిస్తోంది. అతడు తయారుచేసిన టైమ్ మెషిన్ లో ఈ ముగ్గురు స్నేహితులు గతంలోకి వెళ్లారు. అక్కడ ఆది తన తల్లిని చూస్తాడు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఆది చిన్నతనంలో మిస్ అవుతాడు. తన కొడుకును కనిపెట్టమని తల్లి పెద్దగా మారిన కొడుకునే అడగడం. మరి చిన్నతనంలో మిస్ అయిన తనను తానే హీరో ఎలా కనిపెట్టాడు. తల్లి మృతి చెందేటప్పుడు ఆది ఎక్కడున్నాడు..? అసలు టైమ్ ట్రావెల్ వలన ఆది జీవితం ఎలా మారింది..? అనేది కథగా తెలుస్తోంది.
టైమ్ ట్రావెల్ మీద ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. గతంలోకి వెళ్లి వారి చావులను ఆపడం, లేకపోతే చనిపోయిన వారి మీద పగ తీర్చుకోవడం ఇవన్నీ చూసే ఉన్నాం. కానీ ఈ కథలో తనను తాను హీరో వెతకడం. పెద్దయిన కొడుకును చిన్నప్పుడు తల్లి వెతికి పెట్టమనడం కొత్త కాన్సెప్ట్ లా కనిపిస్తోంది. ఇక సింగర్ గా శర్వా.. తల్లిగా అమల న్యాచురల్ గా నటించి మెప్పించారు. వెన్నెల కిషోర్, ప్రియదర్శి తో కామెడీ గురించి చెప్పవనసరం లేదు. సైంటిస్ట్ గా నాజర్ కనిపించాడు. జేక్స్ బిజోయ్ సంగీతం ఫ్రెష్ ఫీల్ ను తీసుకొస్తుంది. మొత్తానికి ట్రైలర్ తోనే సినిమాపై అంచనాలను పెంచేసిన మేకర్స్.. హిట్ అందుకొనేలానే ఉన్నారు. మరి ఈ సినిమాతోనైనా శర్వా హిట్ ను అందుకుంటాడేమో చూడాలి.