NTR30: అఫీషియల్ – తారక్ ఫ్యాన్స్‌కి ఒకటి గుడ్.. మరొకటి బ్యాడ్ న్యూస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NTR30 Movie Makers Announced Shoot and Release Dates: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఆ అప్డేట్ రానే వచ్చేసింది. కొరటాల శివ దర్శకత్వంలో జూ. ఎన్టీఆర్ చేయబోయే ఎన్టీఆర్30 ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ మీదకి వెళ్లనుందో అనౌన్స్‌మెంట్ వచ్చింది. నూతన సంవత్సర దినోత్సవం సందర్భంగా.. ఫిబ్రవరి నుంచి రెగ్యులర్‌గా షూటింగ్ ప్రారంభించనున్నట్టు యూనిట్ అధికారికంగా ప్రకటించింది. దీంతో.. ఈ క్షణం కోసం ఎదురుచూసిన తారక్ ఫ్యాన్స్ నిరీక్షణకు చెక్ పెట్టినట్టయ్యింది. కాకపోతే.. ఇదే సమయంలో మరో బ్యాడ్ న్యూస్ కూడా ఉంది. ఈ సినిమాని వచ్చే ఏడాది ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు అనౌన్స్ చేశారు. ఇలా రిలీజ్ డేట్ వెల్లడించడం మంచి విషయమే కానీ.. ఈ ఏడాదిలో తారక్‌ను వెండితెరపై చూడలేమన్న అసంతృప్తి అభిమానుల్లో ఉంటుంది. తారక్ కోసం ఇప్పుడు ఫ్యాన్స్‌కి కనీసం ఏడాదిన్నర (16 నెలలు) వరకు వేచి చూడాల్సి ఉంటుంది. ఏదేమైనా.. న్యూ ఇయర్ వేళ ఈ బిగ్ అప్డేట్ ఇచ్చినందుకు తారక్ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు.
Harassment: హర్యానా క్రీడా శాఖ మంత్రిపై లైంగిక వేధింపుల కేసు
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత జూ. ఎన్టీఆర్ పాన్ ఇండియా ఇమేజ్ రావడంతో.. దర్శకుడు కొరటాల శివ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా రూపొందించేలా ప్లాన్ చేస్తున్నాడు. అందుకే, ఎప్పుడో సెట్స్ మీదకి వెళ్లాల్సిన సినిమా ఇంత ఆలస్యం అయ్యింది. స్క్రిప్ట్ విషయంలో కొరటాల చాలా మెరుగులు దిద్దాల్సి వచ్చింది. ఇప్పుడు ఔట్‌పుట్ అంతా పర్ఫెక్ట్‌గా వచ్చిందని తారక్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన నేపథ్యంలో.. ఈ సినిమా షూటింగ్ ప్రారంభించేందుకు సమాయత్తమవుతున్నారు. ప్రస్తుతం విదేశాల్లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న తారక్.. తిరిగి రాగానే ఈ సినిమా పనుల్లో నిమగ్నం కానున్నాడు. జనతా గ్యారేజ్ తర్వాత కొరటాల, తారక్ కాంబోలో ఈ సినిమా వస్తుండటం.. పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో.. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇందులో కథానాయికగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఎంపికైనట్టు సమాచారం. ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం సమకూరుస్తున్నాడు.
Cool Drinks: కూల్‌డ్రింక్స్ తెగ తాగుతున్నారా.. ఈ తిప్పలు తప్పవు.. తస్మాత్ జాగ్రత్త!
A man's fury is the cure for a disease called courage 🔥🔥#NTR30 in cinemas on April 5th, 2024 💥
Shoot begins next month 💥
Happy New Year ❤️@tarak9999 #KoratalaSiva @NANDAMURIKALYAN @anirudhofficial @RathnaveluDop @sreekar_prasad @sabucyril @YuvasudhaArts pic.twitter.com/EleAsoa3JZ
— NTR Arts (@NTRArtsOfficial) January 1, 2023
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!