Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
- 4.4 తీవ్రతతో ఉత్తరాఖండ్‌లో భూకంపం
- రాత్రి 10:30 గంటలకు ఒక్కసారిగా ప్రకంపనలు
- ఢిల్లీ-ఎన్సీఆర్ సహా పలు రాష్ట్రాల్లో ప్రభావం
- ప్రాణ, ఆస్తి నష్టంపై ఇప్పటివరకు సమాచారం లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మంగళవారం రాత్రి భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.4గా నమోదైనట్లు సీస్మోలాజికల్ అధికారులు వెల్లడించారు. రాత్రి 10:30 గంటల సమయంలో భూమి తీవ్రంగా కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఉత్తరాఖండ్‌లోని ఖాదున్ లగా గవాలి ప్రాంతానికి దాదాపు 22 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు ప్రాథమిక నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. నిద్రపోయే వేళ హఠాత్తుగా భూమి ప్రకంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురై ఇళ్ల నుంచి వీధుల్లోకి పరుగులు తీశారు.
ఢిల్లీ-ఎన్సీఆర్ సహా పలు రాష్ట్రాల్లో కంపించిన భూమి
ఈ భూకంప ప్రభావం ఒక్క ఉత్తరాఖండ్‌కే పరిమితం కాకుండా పరిసర ఉత్తరాది రాష్ట్రాలకూ విస్తరించింది. జాతీయ రాజధాని ప్రాంతమైన ఢిల్లీ-ఎన్సీఆర్ (Delhi-NCR)తో పాటు హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో స్పష్టమైన ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. బహుళ అంతస్తుల భవనాలు, ఇళ్లలోని ఫ్యాన్లు, వస్తువులు ఊగడంతో నివాసితులు కొద్దిసేపు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
Also Read
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
- Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
అందని నష్టం వివరాలు.. విచారణ వేగవంతం
ఈ భూకంపం భూమిలో ఎంత లోతులో సంభవించిందనే వివరాలు తక్షణమే లభ్యం కాలేదని భూకంప శాస్త్రవేత్తలు తెలిపారు. భూకంపం కారణంగా ఎక్కడా ఆస్తి నష్టం లేదా ప్రాణనష్టం జరిగినట్లు ఇప్పటివరకు ఎలాంటి నివేదికలు అందలేదని అధికారులు వెల్లడించారు. ప్రకంపనల తీవ్రతకు సంబంధించిన పూర్తి వివరాలను, ఇతర గణాంకాలను సీస్మోలాజికల్ విభాగాలు సేకరిస్తున్నాయి. పరిస్థితులపై స్థానిక యంత్రాంగాలు అప్రమత్తమయ్యాయి.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!