కూల్ డ్రింక్స్ అంటే అందరూ ఇష్టపడతారు. చిన్న చిన్న పార్టీల్లోనూ కూల్ డ్రింక్స్ లేకపోతే గడవదు. అయితే, వీటి వల్ల చాలా సమస్యలున్నాయని నిపుణులు చెప్తున్నారు.
కూల్ డ్రింక్స్‌లో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. దీంతో శరీరంలో చక్కెర స్థాయిలో పెరిగి, మధుమేహం వచ్చే ప్రమాదం ఉంటుంది.
కూల్ డ్రింక్స్‌లో ఫ్రక్టోజ్, సుక్రోజ్ అధిక మోతాదులో ఉంటాయి. ఇవి శరీరంలో కేలరీల్ని పెంచుతాయి. ఫలితంగా.. బరువు పెరగి ఊబకాయానికి దారి తీస్తుంది.
కూల్ డ్రింక్స్‌లో ఉండే గ్లూకోజ్, ఫ్రక్టోజ్‌లను జీర్ణం చేసేందుకు కాలేయం చాలా కష్టపడవల్సి ఉంటుంది. ఇవి కాలేయ వాపుకు దారితీసి, అనారోగ్యానికి గురి చేస్తాయి.
కూల్ డ్రింక్స్‌లో ఫాస్పోరిక్ ఆమ్లం, సేంద్రీయ ఆమ్లాలుంటాయి. ఇవి దంతాలపై రక్షణ కవచంగా ఉండే ఎనామెల్‌ను దెబ్బతీస్తాయి. దాంతో దంతాలు త్వరగా ఊడిపోతాయి.
కూల్ డ్రింక్స్‌లో ఉండే కెఫిన్.. శరీరంలో డోపమైన్ అనే కెమికల్ ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. దీని వల్ల రక్తపోటు పెరిగి, గుండె పనితీరు మందగిస్తుంది.
ఫాస్పరిక్ ఆసిడ్ ఉండే కూల్ డ్రింక్స్ తాగడం వల్ల కాల్షియం తగ్గిపోతుంది. తద్వారా ఎముకులు తీవ్రంగా బలహీనపడిపోతాయి.
ప్రెగ్నెన్సీ సమయంలో కూల్ డ్రింక్స్ తాగితే.. మిస్ క్యారేజ్ అయ్యే అవకాశాలున్నాయి. కాబట్టి, ప్రెగ్నెంట్ మహిళలు వీటికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.
కూల్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల గ్యాస్, ఎసిడిటీ సమస్యలు రెట్టింపు అవుతాయి. కాబట్టి.. కూల్ డ్రింక్స్‌కి దూరంగా ఉంటే మంచిది.