Husharu 2: బీరు కోసం ‘క్షీరసాగర మథనం’.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2018లో విడుదలైన ‘హుషారు’ సినిమా యువతను ఏ స్థాయిలో ఉర్రూతలూగించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘ఉండిపోరాదే’ మెలోడీ నుంచి ఫ్రెండ్షిప్ బంధం, బోల్డ్ కంటెంట్ వరకు ప్రతి అంశం అప్పట్లో యూత్‌లో కల్ట్ క్రేజ్ తెచ్చిపెట్టింది. ఇప్పుడు సరిగ్గా ఆరేళ్ల తర్వాత, అదే దర్శకుడు శ్రీహర్ష కొనుగంటి మెగాఫోన్ పట్టి ‘హుషారు 2’ను అధికారికంగా ప్రకటించారు. అయితే టైటిల్ పోస్టర్‌ను డిజైన్ చేసిన తీరు, చిత్ర యూనిట్ ప్రకటించిన నటీనటుల జాబితా ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తాజాగా విడుదలైన టైటిల్ పోస్టర్ నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. మొదటి భాగంలో కుర్రాళ్లు రూపొందించిన ‘కబూమ్ బీరు’ను ఓ ట్రక్కులో ఉంచి, దానికి రెండు వైపులా తాడులాంటి పాముతో కొందరు బలంగా లాగుతున్నట్లు చూపించారు. ట్రక్కు కింద తాబేలు, కాస్త దూరంలో బంగారు ఆభరణాల పెట్టె, వెనుక ఫ్యాక్టరీ.. ఇవన్నీ చూస్తుంటే హిందూ పురాణాల్లోని ప్రసిద్ధ ‘అమృత మథనం’ ఘట్టాన్ని గుర్తుకు తెస్తోంది.
ఇక్కడ ‘బీరు ట్రక్కు’ చుట్టూ ముడిపెడుతూ డిజైన్ చేయడం తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. పవిత్రమైన పౌరాణిక ఘట్టాన్ని ఇలా మోడ్రన్ యూత్‌ఫుల్ మ్యాడ్‌నెస్‌కు, ఆల్కహాల్ బ్యాక్‌డ్రాప్‌కు లింక్ చేయడం కొందరిలో భిన్నాభిప్రాయాలకు కూడా తావిస్తోంది. ఆ కాన్సెప్ట్ వెనుక దర్శకుడు ఏం చెప్పబోతున్నాడనేది ఇప్పుడు అసలైన మిస్టరీ. మరో ఆసక్తికర అంశం క్యాస్ట్ లో చోటుచేసుకున్న మార్పులు. మొదటి భాగంలో మెప్పించిన ప్రధాన తారాగణంలో కొందరి పేర్లు మిస్ అవ్వగా, మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా ఈ సీక్వెల్లో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. రాహుల్ రామకృష్ణ, రవి అంథోని, దినేష్ తేజ్, శశిధర్ కోచర్లకోట వంటి వారు ఉన్నప్పటికీ.. ఈసారి క్యాస్టింగ్‌లో జరిగిన మార్పులు కథను సరికొత్త మలుపు తిప్పనున్నట్లు స్పష్టమవుతోంది.
Also Read
ఎలాంటి హడావుడి లేకుండా రహస్యంగా ప్రధాన చిత్రీకరణ అంతా పూర్తి చేసిన చిత్ర బృందం, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేసింది. కేవ్‌మ్యాన్ స్టోరీస్, హెచ్‌కే ఫిల్మ్స్, కలియుగ వారధి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సన్నీ ఎం.ఆర్ సంగీతం అందిస్తుండగా, రామ్ మిర్యాల అదనపు బాణీలు సమకూరుస్తున్నారు. ఏడాది చివర్లో ఈ క్రేజీ సీక్వెల్‌ను వెండితెరపైకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Husharu 2: బీరు కోసం ‘క్షీరసాగర మథనం’.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
-
Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
-
Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. ‘అనకాపల్లి’ నిర్మాత ఆవేదన!
-
Hormuz Strait: హోర్ముజ్‌లో నౌకపై దాడి.. 11 మంది భారతీయ నావికులకు గాయాలు
-
Cyber Crime Crackdown: సైబర్ ముఠాలపై బిగ్ ఆపరేషన్.. 100 మందికి పైగా అరెస్ట్..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!