Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. ‘దొంగ నా కొడుకు’ రిలీజ్ డేట్ ఫిక్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాధారణంగా సినిమాలకు క్లాస్ పేర్లో, లేదంటే మాస్ ఆడియన్స్‌ను ఉర్రూతలూగించే టైటిల్స్ పెట్టడం చూస్తుంటాం. కానీ టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ మాత్రం ఈసారి అందరినీ విస్తుపోయేలా చేస్తూ ఏకంగా ఓ తిట్టు పదాన్నే సినిమా టైటిల్‌గా మార్చేసింది. నిత్య జీవితంలో కోపమొచ్చినప్పుడో, సరదాగానో వాడే ‘దొంగ నా కొడుకు’ అనే బూతు ముద్ర ఉన్న పదాన్ని పెద్ద బ్యానర్లో సినిమా టైటిల్‌గా ప్రకటించడం హాట్ టాపిక్‌గా మారింది. సమాజంలో కాస్త అభ్యంతరకరంగా భావించే ఈ పదాన్ని మేకర్స్ చాలా తెలివిగా చిత్ర కథకు ముడిపెట్టినట్లు తెలుస్తోంది. ‘లిటిల్ హార్ట్స్’ ఫేమ్ మౌళి తనుజ్ ప్రశాంత్ హీరోగా నటిస్తున్న ఈ క్రైమ్ కామెడీ మూవీలో.. ఒక జ్యువెలరీ షాప్‌లో జరిగే దొంగతనం, ఆ తర్వాత జరిగే గందరగోళ పరిస్థితులే ప్రధాన కథాంశం.
పోస్టర్ చూస్తే హీరో చెవి పట్టుకుని తల్లి నిలదీస్తుండగా, పక్కనే తండ్రి ఆందోళనగా చూస్తున్న దృశ్యం కనిపిస్తుంది. అంటే నిజంగానే కొడుకు ఇంట్లో నుంచి వెళ్లి దొంగతనాలు చేస్తుండడంతో, తల్లిదండ్రుల కోణంలో ‘దొంగ నా కొడుకు’ అనే మాటను మార్చి పెట్టినట్లు స్పష్టమవుతోంది. ఏది ఏమైనా, ప్రచారానికి పదును పెట్టేందుకు ఇంత బోల్డ్ టైటిల్ ఎంచుకోవడం సెన్సేషన్‌గా మారింది.
Also Read
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
- Indraja: నటి ఇంద్రజను చూసి ఏడ్చేసిన టాలీవుడ్ నిర్మాత
నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రంతో శ్రీను కంబాల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థ నుంచి యూట్యూబ్, ఓటీటీ కంటెంట్‌తో గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు మౌళి ప్రధాన పాత్రలో రావడం, దానికితోడు ఆసక్తికర పోస్టర్ విడుదల కావడంతో యూత్‌లో భారీ హైప్ మొదలైంది. ఈ వినోదాత్మక రాబరీ డ్రామా నవంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
తాజావార్తలు
-
Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. ‘దొంగ నా కొడుకు’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
WI Vs IND: వెస్టిండీస్‌తో మొదటి టీ20 మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..
-
Fraud Wedding: ఆప్ నాయకుడిని పెళ్లి పేరుతో బురిడీ కొట్టించిన నకిలీ అధికారిణి.. ఆ తర్వాత ఏమైందంటే..!
-
Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
-
Saudi-Houthi War: ‘‘పాక్, టర్కీ వస్తే మాకేంటి.?’’ సౌదీపై తగ్గని హౌతీల దాడులు..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!