Haryana Sports Minister Sandeep Singh booked for harassment: హర్యానా క్రీడా శాఖ మంత్రి సందీప్ సింగ్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. మహిళా జూనియర్ కోచ్ పోలీసులకు లైంగిక వేధింపుల ఆరోపణలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. చండీగఢ్ పోలీసులు శనివారం సందీప్ సింగ్ పై వేధింపులు, అక్రమంగా నిర్భందించడం, లైంగిక వేధింపులు, నేరపూరిత బెదిరింపులు కింద కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఒలింపియన్, భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ అయిన సిందీప్ సింగ్ పై శనివారం రాత్రి సెక్టార్ 26 పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు అయింది. అయితే మంత్రి తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారం అయినవని అన్నారు.
Read Also: Odisha: దేశంలోనే అతిపెద్ద ఉద్యోగ మోసం గుట్టురట్టు.. నిరుద్యోగులే టార్గెట్‌గా స్కామ్..
ఫిబ్రవరి-నవంబర్ మధ్యకాలంలో మంత్రి తన కార్యాలయంలో, ఇతర ప్రదేశాల్లో తనను వేధించారని మహిళా కోచ్ మంత్రిపై ఆరోపణలు చేశారు. ఒకసారి తనను సెక్టార్ 7లో కలవమని అడిగారని.. మంత్రి ఎక్కువగా తనను సోషల్ మీడియా ద్వారా కమ్యూనికేట్ చేసేవాడని.. చండీగఢ్ లోని తన ఇంట్లో తనను అనుచితంగా తాకాడు అని మహిళ ఆరోపించారు. ఈ వేధింపులపై మహిళా కోచ్ శుక్రవారం చండీగఢ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో మంత్రిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. సిటీ ఎస్పీ శృతి అరోరాకు ఫిర్యాదు సమర్పించింది. అధికారులు సదరు మహిళతో గంటసేపు సంభాషించినట్లు సమాచారం. ఫిర్యాదు తర్వాత.. ఈ కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తామని నాకు హామీ ఇచ్చారని.. నా భద్రత అంశాన్ని కూడా లేవనెత్తానని.. నా సోషల్ మీడియా ఖాతాలకు బెదిరింపు సందేశాలు వస్తున్నాయని.. భయంతో నేను ఫోన్ కాల్స్ చేయడం మానేశానని వెల్లడించింది.
మహిళా కోచ్ మాట్లాడుతూ.. రాబోయే అంతర్జాతీయ ఈవెంట్లలో పతకాలు సాధిస్తానని హామీ ఇవ్వాల్సి వచ్చిందని.. నేను ఫెయిల్ అయితే క్రీడా శాఖ మంత్రి నన్ను బదిలీ చేస్తారని చెప్పారని పేర్కొంది. ఇటీవలనే ఎలాంటి సదుపాయాలు లేని నా సొంత జిల్లా ఝజ్జర్ కు బదలీ అయినట్లు మహిళ తెలిపింది. వేధింపులకు గురవుతున్నది తాను ఒక్కదానినే కాదని..ఇలాంటి వేధింపులు ఇంకా చాలా మందికి జరుగుతున్నాయని చెప్పింది. ఫిర్యాదు చేసిన మహిళ క్రీడాశాఖ మంత్రి సందీప్ సింగ్ తనకు పంపిన మేసేజుల రికార్డు లేదని వెెల్లడించారు.