గత కొన్ని రోజులుగా ప్రభాస్ సలార్ 2 స్టార్ట్ చేయాలనే ప్లాన్ లో ఉన్నాడు అనే వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇదే జరిగి సలార్ 2 సెట్స్ పైకి వెళ్తే కనీసం ఏడాది పాటు ప్రశాంత్ నీల్ లాక్ అయిపోతాడు. దీంతో ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ వాయిదా పడుతుంది. ఎన్టీఆర్ 31 ప్రాజెక్ట్ గా అనౌన్స్ అయిన నీల్-ఎన్టీఆర్ కాంబినేషన్ లో ప్రాజెక్ట్ డిలే అయితే ఇమ్మిడియట్ గా సెట్స్ పైకి వెళ్లడానికి తారక్ లైనప్ లో ఉన్న సినిమాలు ఏంటో చూస్తే… వార్ 2, దేవర 2లు మాత్రమే కనిపిస్తున్నాయి. వార్ 2 సినిమాకి ఎన్టీఆర్ ఎక్కువ డేట్స్ ఇచ్చే అవకాశం లేదు, రెండు మూడు నెలల్లో ఎన్టీఆర్ పార్ట్ వరకు షూటింగ్ ని కంప్లీట్ చేస్తారు. వార్ 2 తర్వాత దేవర 2… దేవర 1 రిజల్ట్ ని బట్టి కొంచెం ముందు వెనక స్టార్ట్ అవుతుంది. దేవర 2 కొరటాల శివ తప్పకుండా టైమ్ తీసుకుంటాడు. ఇలాంటి సమయంలో ఎన్టీఆర్ వెంటనే ప్రాజెక్ట్ చేసే అవకాశం ఉన్న దర్శకుడిగా త్రివిక్రమ్ కనిపిస్తున్నాడు.
త్రివిక్రమ్, ఎన్టీఆర్ లు కలిసి ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమా చేశారు. అరవింద సమేత సినిమా ఇచ్చిన జోష్ లో ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో రెండో సినిమా అనౌన్స్ అయ్యింది. ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమా సెట్స్ పైకి వెళ్తుందని అంతా డిసైడ్ కూడా అయ్యారు కానీ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింది. ప్రస్తుతం ఎన్టీఆర్, కొరటాలతో సినిమా చేస్తుంటే త్రివిక్రమ్, మహేశ్ తో సినిమా చేకంప్లీట్ చేసాడు. పుష్ప 2 రిలీజ్ అయ్యి అల్లు అర్జున్ కాస్త రెస్ట్ తీసుకునే వరకూ త్రివిక్రమ్-బన్నీ సినిమా స్టార్ట్ అయ్యే అవకాశం లేదు. ఈ కారణంగా త్రివిక్రమ్ లైనప్ లో కూడా గ్యాప్ ఉంది. సో ప్రశాంత్ నీల్ సలార్ 2 నుంచి ఫ్రీ అయ్యే లోపు… ఎన్టీఆర్-త్రివిక్రమ్ కలిసి ప్రాజెక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. మరి ఈ ఆప్షన్ ని త్రివిక్రమ్-ఎన్టీఆర్ కన్సిడర్ చేసి ఒక పాన్ ఇండియా సినిమా చేస్తారేమో చూడాలి.