మహేష్ తో అనిల్ రావిపూడి మూవీ… వెయిట్ చేయాల్సిందేనట !

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో “సరిలేరు నీకెవ్వరు” మూవీ వచ్చింది. 2020 సంక్రాంతి పండుగ వారాంతంలో తెరపైకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత వీరిద్దరూ మరో సినిమా కోసం కలిసి వర్క్ చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. దర్శకుడు అనిల్ రావిపూడి కూడా రీసెంట్ ఇంటర్వ్యూలలో మహేష్ తో మరో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించాడు. కానీ తెలియని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ ఇంకా పట్టాలెక్కలేదు. ఇదిలా ఉండగా ఓ ఇంటర్వ్యూలో అనిల్ స్వయంగా ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడారు.

Read Also : మహేష్ కోసం “ఎస్‌ఎస్‌ఎమ్‌బి 28” స్పెషల్ వీడియో

ఒక తెలుగు వార్తాపత్రికతో అనిల్ మాట్లాడుతూ “ఎఫ్ 3” తర్వాత నేను బాలకృష్ణతో సినిమా చేస్తాను. ఆ తరువాత మహేష్ బాబుతో… మహేష్ బాబుకు ఒక స్టోరీలైన్ చెప్పాను. అది ఆయనకు కూడా నచ్చింది. కానీ మహేష్ ప్రస్తుతం ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. కాబట్టి ఆయన డేట్స్ ను సర్దుబాటు చేయడానికి, నా ప్రాజెక్ట్ షెడ్యూల్ చేయడానికి కొంత సమయం పట్టవచ్చు” అని తెలిపారు. దీంతో మహేష్, అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ గురించి క్లారిటీ వచ్చింది. అయితే ఇప్పుడే కాకపోయినా 2022 తరువాత ఈ కాంబోలో మూవీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అనిల్ రావిపూడి “ఎఫ్ 3” పనుల్లో బిజీగా ఉన్నారు. ఇందులో వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ పిర్జాదా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

Related Articles

Latest Articles