దేవర వాయిదా… ఈ విషయంలో మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావడం ఒక్కటే మిగిలింది. దేవర పోస్ట్ పోన్ అవ్వడం దాదాపు ఖాయమనే మాట ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. దేవర లాక్ చేసుకున్న ఏప్రిల్ 5న ఖర్చీఫ్ వేయడానికి ఇతర సినిమాలు ఇప్పటికే నిర్మతల మండలిలో డిస్కషన్స్ కూడా స్టార్ట్ చేసేశారని టాక్. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న దేవర మూవీని ఏప్రిల్ 5న రిలీజ్ చేస్తామని ఎప్పుడో అనౌన్స్ చేశారు కానీ ఎలక్షన్స్, హిందీ రిలీజ్, విలన్‌కు గాయాలు లాంటి అనేక కారణాలను దృష్టిలో పెట్టుకొని దేవరను వాయిదా వేస్తున్నట్టుగా గత వారం రోజులుగా వార్తలు వస్తున్నాయి కానీ దేవర టీమ్ నుంచి ఇంకా క్లారిటీ రాలేదు. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం మేరకు దేవర లాక్ చేసిన డేట్ కి థియేటర్స్ లోకి రావడానికి రెడీ అవుతున్నాడు రౌడీ హీరో ది విజయ్ దేవరకొండ. ఈ రౌడీ హీరో నటిస్తున్న ఫ్యామిలీ స్టార్ మూవీని దాదాపుగా ఏప్రిల్ 5న రిలీజ్ చేయడానికి రెడీ అయినట్టుగా ఇండస్ట్రీ వర్గాల పక్కా సమాచారం.
ఫ్యామిలీ స్టార్ నుంచి అధికారిక ప్రకనటన రావడమే లేట్.. రిలీజ్ డేట్ ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది. దీంతో అనధికారికంగా దేవర పోస్ట్‌పోన్ అయినట్టే. అయితే.. దేవర కొత్త రిలీజ్ డేట్ ఏంటనేది? ఆసక్తికరంగా మారింది. ఆగష్టు 15న దేవర రిలీజ్ అవుతుందని చెబుతున్నా… పుష్ప2 పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. దీంతో దేవర రిలీజ్ ఎప్పుడు? కొరటాల ఏం ప్లాన్ చేస్తున్నాడు? అనేది తెలియాల్సి ఉంది. అయితే… దేవర వాయిదా పడుతుందని కొంతమంది యంగ్ టైగర్ ఫ్యాన్స్ డిజప్పాయింట్ అవుతుంటే… కొందరు మాత్రం ఏం పర్లేదు అని అంటున్నారు. దేవర సినిమా సముద్రం బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతోంది కాబట్టి… వాయిదా పడితే విఎఫ్‌ఎక్స్ వర్క్‌కు చాలా సమయం దొరుకుతుంది కాబట్టి దేవర ఏప్రిల్ నుంచి వాయిదా పడిన పర్లేదు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికే దేవర షూటింగ్ 85 శాతం కంప్లీట్ అయింది కాబట్టి… నెక్స్ట్ కొరటాల ఫోకస్ అంతా విఎఫ్‌ఎక్స్ వర్క్ పైనే ఉండనుంది. మరి దేవర రిలీజ్ ఎప్పుడుంటుందో చూడాలి.