యంగ్ టైగర్ ఎన్టీఆర్… కమర్షియల్ సినిమాకి కొత్త అర్ధం చెప్పిన కొరటాల శివ కలిసి ‘దేవర’ సినిమా చేస్తున్నారు. సముద్రం బ్యాక్ డ్రాప్ లో, భారీ బడ్జట్ తో హ్యూజ్ విజువల్ ఎఫెక్ట్స్ తో దేవర సినిమా తెరకెక్కుతుంది. దేవర సినిమాతో వచ్చే ఏడాది ఏప్రిల్ 5న పాన్ ఇండియా బాక్సాఫీస్ ని రిపేర్ చేయడానికి కొరటాల శివ-ఎన్టీఆర్ రెడీ అయ్యారు. ఈ ఇద్దరూ అన్ని రీజియన్స్ లో సాలిడ్ హిట్ కొడతారని ఫ్యాన్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఆ నమ్మకానికి కారణం ఏడేళ్ల క్రితం రిలీజ్ అయిన ‘జనతా గ్యారేజ్’ సినిమా. ఎన్టీఆర్ కి బృందావనం లాంటి క్లాస్ రోల్ ని రాసిన కొరటాల శివ… తన మార్క్ రైటింగ్ తో ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ సినిమా చేసాడు. ఈ మూవీలో ఎన్టీఆర్ స్టైల్ కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. చాలా సెటిల్డ్ గా ఎన్టీఆర్ డైలాగ్స్ చెప్పిన విధానానికి, కొరటాల శివ ఎన్టీఆర్ క్యారెక్టర్ ని డిజైన్ చేసిన విధానానికి బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిసింది.
ముఖ్యంగా ఎన్టీఆర్-మోహన్ లాల్ మధ్య సీన్స్ జనతా గ్యారేజ్ సినిమాకి హైలైట్ గా నిలిచాయి. కంప్లీట్ యాక్టర్ అయిన మోహన్ లాల్ ముందు ఎన్టీఆర్ నిలబడి డైలాగ్స్ చెప్తూనే నందమూరి అభిమానులు విజిల్స్ వేశారు. రిజిస్టార్ ఆఫీస్ ఫైట్ కైతే నందమూరి అభిమానులకి పూనకాలే వచ్చాయి. అంతెందుకు ఎన్టీఆర్ సినిమాలో ముందుగా ఎన్టీఆర్ కనిపించకుండా మోహన్ లాల్ కనిపించి దాదాపు 20-25 నిమిషాల తర్వాత ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ వస్తుంది అంటే నమ్ముతారా. కథని అంత బలంగా చెప్పి ఎన్టీఆర్ ని కథలోకి తీసుకోని వచ్చి సినిమాని సక్సస్ ఫుల్ గా నడిపించాడు కొరటాల శివ. దేవి శ్రీ ప్రసాద్ జనతా గ్యారేజ్ సినిమాకి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఎన్టీఆర్ కి మొదటి వంద కోట్ల సినిమా అయిన జనతా గ్యారేజ్ రిలీజ్ అయ్యి ఏడేళ్లు అయిన సంధర్భంగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఏడేళ్ల క్రితం ఇదే రోజున రీజనల్ బాక్సాఫీస్ ని రిపేర్ చేసిన ఎన్టీఆర్-కొరటాల శివ వచ్చే ఏడాది పాన్ ఇండియా బాక్సాఫీస్ ని రిపేర్ ఏ రేంజులో చేస్తారో చూడాలి.