NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను నందమూరి కళ్యాణ్ రామ్ నందమూరి ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో తారక్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో సైఫ్ ఆలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా తర్వాత తారక్ నటిస్తున్న చిత్రం వార్ 2. ఎన్టీఆర్ ఫస్ట్ బాలీవుడ్ డెబ్యూ. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించనున్నాడు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ మల్టీస్టారర్ గా వచ్చిన వార్ కు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కనుంది. ఇందులో తారక్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రను చేయబోతున్నాడట. అందుకే ఆ పాత్ర కోసం తారక్ మంచి కండలు పెంచబోతున్నాడట.
Samantha: చైతూను మర్చిపోలేకపోతున్న సామ్.. ఇదే సాక్ష్యం
బాలీవుడ్ లో ఫైట్ సీన్స్ లో హీరోలు సిక్స్ ప్యాక్ తో కనిపించడం కామన్ అన్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్- హృతిక్ మధ్య ఫైట్ సీన్స్ కూడా ఉండనున్నాయని టాక్. దీనికోసమే బలమైన కండలు కావాలని మేకర్స్ తెలుపడంతో ఎన్టీఆర్ కండలు పెంచడానికి సిద్ధమయ్యాడని తెలుస్తోంది. కండలు పెంచడం కోసం ఎన్టీఆర్ దుబాయ్ లేదా అమెరికా వెళ్లి ప్రత్యేక ట్రైనర్స్ పర్యవేక్షణలో బాడీని పెంచనున్నాడని తెలుస్తుంది.ఈ విషయం తెలియడంతో అభిమానుల అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే తారక్..టెంపర్, అరవింద సమేత సినిమాల్లో సిక్స్ ప్యాక్ తో అలరించాడు. ఇప్పుడు వార్ 2 లో మరోసారి తారక్ సిక్స్ ప్యాక్ తో కనిపించనున్నాడు. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది.