Samantha: సమంత, నాగచైతన్య మర్చిపోలేకపోతుందా అంటే నిజమే అంటున్నారు అభిమానులు. అలా అనుకోవడానికి కారణం కూడా లేకపోలేదు. అదేంటంటే ఎప్పుడు చైతన్య గురించి ఆమె బయట మాట్లాడిన ఆమె కళ్ళల్లో ఏదో ఒక తెలియని నిరాశను చూస్తూ ఉన్నారు అభిమానులు. తాజాగా నిన్న జరిగిన ఖుషీ మ్యూజిక్ కన్సర్ట్ లో కూడా ఇదే విషయాన్ని గ్రహించామని అభిమానులు చెప్పుకొస్తున్నారు. అదేంటంటే ఎంతో ఎనర్జిటిక్ గా ఈవెంట్ లో అడుగుపెట్టిన సమంత, విజయ్ తో డాన్స్ చేసింది. కిందకి వచ్చి సింగర్స్ పాడిన ప్రతి పాటను ఆస్వాదించింది. అయితే మధ్యలో మజిలీ సినిమా నుంచి ప్రియతమా ప్రియతమా సాంగ్ వచ్చేటప్పుడు మాత్రమే ఆమె ఎమోషనల్ గా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మజిలీలో నాగచైతన్య, సమంత జంటగా నటించిన విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత వారిద్దరి నుంచి వచ్చిన సినిమా మజిలీ. ఈ సినిమకు కూడా శివ నిర్వాణనే దర్శకుడు. అయితే గతంలో ఖుషీ సినిమాను చైతు సమంతలతోనే శివనిర్మాణ చేయాలనుకున్నాడట. ఆ తర్వాత వీరిద్దరూ విడాకులు తీసుకోవడంతో చై ప్లేస్ లో విజయ్ వచ్చాడని ఒక టాక్ నడిచింది. అయితే అందులో నిజం ఎంత అనేది తెలియదు కానీ.. ఇప్పుడు ఈ వీడియోలో సమంత ఎక్స్ప్రెషన్స్ మాత్రం అభిమానులను ఆందోళనలోకి నెడుతున్నాయి.
Khushi: ఎదకు ఒక గాయం.. బ్రేకప్ లవర్స్ లిస్ట్ లో ఇంకో సాంగ్
నాలుగేళ్లు వైవాహిక బంధం లో కలిసి ఉన్న సమంత, చైతన్య ఒక్కసారిగా విడాకులు తీసుకొని విడిపోయారు. విడిపోవడానికి వారి కారణాలు ఎన్ని ఉన్నా, విడిపోయాక స్నేహితులుగా ఉంటామని చెప్పినా.. ఇప్పటికీ వారిద్దరూ కలుసుకున్నది లేదు, మాట్లాడుకున్నది లేదు. ఇక చై తన కెరీర్ ను సెట్ చేసుకునే పనిలో ఉండగా.. సమంత ప్రస్తుతం మయోసైటిస్ వ్యాధి నుంచి కోలుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. ఇక చూసాక పాత గాయాలను మర్చిపోవడం అంత తేలిక కాదు అని, సమంత చూసే అర్థమవుతుందని అభిమానులు అంటున్నారు. ఎంత భర్త నుంచి విడాకులు తీసుకున్నప్పటికీ .. పాత జ్ఞాపకాలు సామ్ ను ఇంకా వెంటాడుతున్నాయని చెప్పుకొస్తున్నారు. అందుకు ఈ వీడియోని సాక్ష్యమని అంటున్నారు. అప్పట్లో ప్రియతమా సాంగ్ వచ్చిన ప్రతిసారి సామ్ కళ్ళల్లో ఆనందం కనిపించేది అని.. ఈసారి మాత్రం ఆ కళ్ళల్లో నిరాశ, నిస్పృహ, చై లేడనే బాధ కనిపిస్తున్నాయని అభిమానులు అంటున్నారు. ఏది ఏమైనా సామ్, చైను మిస్ అవుతుంది అనేది మాత్రం బాగా తెలుస్తుందని ఖరాకండీగా చెప్పుకొస్తున్నారు. సామ్ ను ఇలా చూసిన అభిమానులు ఆమె దైర్యంగా ఉండాలని, దేవుడు ఆ ధైర్యాన్ని సామ్ కు ఇవ్వాలని చెప్పుకొస్తున్నారు.
"Time will heal" గాడిద గుడ్డు ఎం కాదు!!
Not some scars, Never ❤️🩹 pic.twitter.com/uWIWXmresw— 🦋🩵 (@Sravanthi_Sam) August 16, 2023