ఆర్ ఆర్ ఆర్ తర్వాత సాలిడ్ లైనప్ సెట్ చేసుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. తనకొచ్చిన గ్లోబల్ రీచ్ ని మ్యాచ్ అయ్యేలా ఎన్టీఆర్ తన నెక్స్ట్ సినిమాలని సాలిడ్ గా రెడీ చేస్తున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ 30 ప్రాజెక్ట్ చేస్తున్న ఎన్టీఆర్, ఇప్పటికే రెండు యాక్షన్ షెడ్యూల్స్ కంప్లీట్ చేశాడు. జనతా గ్యారేజ్ తర్వాత కొరటాల, ఎన్టీఆర్ చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో.. అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. నెక్స్ట్ ఇయర్ సమ్మర్ సీజన్ ని గ్రాండ్ గా స్టార్ట్ చేస్తూ ఏప్రిల్ 5న ఎన్టీఆర్ 30 రిలీజ్ కానుంది. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్తో ‘ఎన్టీఆర్ 31’ ప్రాజెక్ట్ చేయనున్నాడు తారక్. ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేశారు. ప్రజెంట్ ప్రభాస్ ‘సలార్’ మూవీతో బిజీగా ఉన్నాడు ప్రశాంత్ నీల్, సెప్డెంబర్ 28న ఈ మూవీ రిలీజ్ కానుంది. ఆ తర్వాత నీల్ తన ఫోకస్ ని ఎన్టీఆర్ 31 పై షిఫ్ట్ చేయనున్నాడు. సెప్టెంబర్ మిడ్ వరకూ ప్రశాంత్ నీల్ సలార్ నుంచి పక్కకి వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి ‘ఎన్టీఆర్ 31’ గురించి బయట పెద్దగా చర్చలు జరగట్లేదు కానీ ఆ హీట్ ని మళ్లీ ఆన్ చేస్తూ మే 20న ఎన్టీఆర్ 31 అప్డేట్ బయటకి వచ్చే ఛాన్స్ ఉంది. ఎన్టీఆర్ బర్త్ డే రోజున ఈ హ్యూజ్ కమర్షియల్ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ వచ్చేస్తే, నేషనల్ వైడ్ ట్రెండ్ అవ్వడం గ్యారెంటీ.
ఇదిలా ఉంటే ఇంకా షూటింగ్ డేట్స్ కూడా క్లారిటీ లేని ‘ఎన్టీఆర్ 31’ క్యాస్టింగ్ గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. గతంలో ఓ స్టార్ హీరోని విలన్గా తీసుకునేందుకు ప్రశాంత్ నీల్ ట్రై చేస్తున్నట్టు వినిపించింది. ఈ లిస్టులో విక్రమ్, అమీర్ ఖాన్ పేర్లు కూడా వినిపించాయి. ఇక ఇప్పుడు హీరోయిన్గా ప్రభాస్ బ్యూటీని తీసుకోబోతున్నట్టు తెలుస్తోందని రూమర్ వినిపిస్తోంది. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘సాహో’ సినిమాలో శ్రద్దా కపూర్ హీరోయిన్గా నటించింది. ఈ బ్యూటీ సాహో తర్వాత మరో తెలుగు హీరోతో రొమాన్స్ చేయలేదు కానీ ఇప్పుడు ఎన్టీఆర్ సరసన శ్రద్ధా కపూర్ ఫైనల్ అయిందంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇందులో ఎంత నిజం ఉంది? మే 20న నీల్-ఎన్టీఆర్ ల నుంచి ఎలాంటి అప్డేట్ బయటకి వస్తుంది అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.