NTR : ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా.. ఎన్టీఆర్ ఎమోషనల్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీరాముడు, శ్రీకృష్ణుడు విగ్రహా రూపాల కంటే.. వాళ్ల రూపం అచ్చం ఇలాగే ఉంటుందేమోనని అనిపించేలా.. ఇప్పటికీ, ఎప్పటికీ.. తెలుగువారికి గుర్తుకొచ్చే రూపం ఆయనదే. నటుడిగా తెలుగు ప్రేక్షకుడి గుండెల్లో.. నాయకుడిగా తెలుగు వారి హృదయాల్లో ఆయన వేసిన ముద్ర శాశ్వతం. తెలుగు ప్రజల కీర్తిని ఖండాంతరాలకు చాటి చెప్పిన శక పురుషుని శత జయంతి సంవత్సరం ఇది. సినీనేత.. జననేత.. తిరుగులేని కథానాయకుడు.. ఎదురులేని మహానాయకుడు… విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు 100వ జయంతి నేడు. దాంతో తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. తమ అభిమాన నాయకుడిని స్మరించుకొని భావోద్వేగానికి లోనవుతున్నారు ప్రజలు. ఇక తమ తాతను తలుచుకుని ఎంతో ఎమోషనల్ అయ్యారు జూనియర్ ఎన్టీఅర్, కళ్యాణ్ రామ్. ఈ సందర్భంగా హైదరాబాద్ టాంక్ బండ్ దగ్గరున్న ఎన్టీఆర్ ఘాట్‌ను సందర్శించి నివాళులు అర్పించారు.
ఉదయం ఐదు గంటల ప్రాంతంలో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్.. ఎన్టీఆర్ ఘాట్‌కు విచ్చేసి.. నివాళులు అర్పించిన తర్వాత అక్కడే కాసేపు కూర్చున్నారు. ఆ సమయంలో అక్కడికి అభిమానులు భారీగా వచ్చారు.. జై ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు. ఇక అన్నగారు అంటే.. ప్రతి ఒక్క తెలుగువారికి ఒక ఎమోషన్ ఉంది. అయితే జూనియర్ ఎన్టీఆర్‌కి తన తాత పై ఉండే ప్రేమ మాత్రం మాటల్లో వర్ణించలేనిది. టాలీవుడ్ టాప్ హీరోగా.. యంగ్ టైగర్‌గా.. నిత్యం ఎన్టీఆర్ నామ స్మరణతో ముందుకు సాగుతున్నాడు. తన తాత పట్ల ప్రేమను, గౌరవాన్ని, విధేయతను మరోసారి చాటుతూ.. సదా మిమ్మల్ని స్మరించుకుంటూ.. అంటూ భావోద్వేగ ట్వీట్ చేశారు ఎన్టీఆర్. ‘మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది. మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది.. పెద్ద మనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా .. అంటూ ఎమోషనల్ అయ్యారు జూనియర్ ఎన్టీఆర్. దాంతో తారక్ అభిమానులు మరింత ఎమోషనల్ అవుతున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Also Read
- Hero - Director : హిట్స్ కోసం కొత్త రూట్ వెతుకుతున్న హీరోలు, దర్శకులు
- Janhvi Kapoor: జాన్వీ కపూర్ ఓటీటీ ఎంట్రీ.. పా.రంజిత్ షో రన్నర్‌గా తమిళ సిరీస్!
- Rahul Sipligunj : స్నేహితుడు ప్రేమ వ్యవహారంలో రాహుల్ సిప్లిగంజ్‌పై కేసు.. విశాఖలో FIR నమోదు
- Jana Nayagan OTT Release: విజయ్ ‘జన నాయగన్’ ఓటీటీ ఎంట్రీ ఫిక్స్.. ఏ ప్లాట్ఫామ్లో అంటే?
తాజావార్తలు
-
USA: ఉద్యోగంలో చేరిన కొన్ని రోజులకే.. అమెరికాలో ఏపీకి చెందిన టెక్కీ మృతి..
-
Hero – Director : హిట్స్ కోసం కొత్త రూట్ వెతుకుతున్న హీరోలు, దర్శకులు
-
Vaibhav Sooryavanshi: మైదానంలోనే కాదు మార్కెట్లోనూ వైభవ్ జోరు.. 15 ఏళ్లకే కోట్లలో సంపాదన!
-
Prakash Raj: “నా ఓటు తొలగించి, ఆట మొదలుపెట్టారు”.. SIRపై ప్రకాష్ రాజ్ వార్నింగ్..
-
AP Economic Growth: ఏపీకి గుడ్ న్యూస్.. ఎల్‌నినో ప్రభావం ఉన్నా ఆర్థిక వృద్ధిలో దూకుడు..
ట్రెండింగ్
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?