RRR మూవీ విడుదలకు సర్వం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల నిరీక్షణకు తెర పడనుంది. ఇప్పటి వరకూ సినిమా ప్రమోషన్లలో మునిగి తేలిన స్టార్స్ ఎన్టీఆర్, చరణ్ కూడా సినిమా విడుదల గురించి ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే సినిమా ప్రమోషన్లలో భాగంగా చాలా ఆసక్తికర విషయాలను వెల్లడించారు ఇద్దరు స్టార్స్. అలాగే సినిమాపై మరింత హైప్ పెంచేసిన “నాటు నాటు” సాంగ్ గురించి కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. “నాటు నాటు” సాంగ్ విడుదలైనప్పుడు అందులోకి హూక్ స్టెప్పుకు ప్రేక్షకుల నుంచి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. ఇద్దరు హీరోలూ కలిసి ఆ స్టెప్పులేయడం విజువల్ ఫీస్ట్ అయ్యింది అభిమానులకు.
Read Also : Pushpa 2 : సామ్ స్థానంలో బాలీవుడ్ భామ ?
అయితే సినిమాలోని ప్రతి సన్నివేశం కోసం మాత్రమే కాదు ఈ సాంగ్ కోసం వేసిన స్టెప్పుల వెనుక కూడా చెర్రీ, తారక్ ల కష్టం ఉంది. “నాటు నాటు” సాంగ్ కోసం ఏకంగా 17 టేకులు తీసుకున్నారట. అప్పటికి గానీ జక్కన్న శాంతించలేదట. అయితే గమనించదగ్గ విషయమేమిటంటే 17 టేకులు తీసుకున్న జక్కన్న చివరికి 2 టేకునే ఫైనల్ చేశాడట. సుమతో జరిగిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్నీ వెల్లడించారు. అయితే పర్ఫెక్షన్ కోసమే రాజమౌళి ఇలా చేశారట !