యంగ్ హీరో నాగశౌర్య ఫామ్ హౌస్ ప్రముఖుల పేకాటకు అడ్డాగా మారిందంటూ ఈరోజు ఉదయం వచ్చిన వార్త ఆయన అభిమానులకు షాక్ కు గురి చేస్తోంది. నిన్న సాయంత్రం నాగశౌర్య విల్లా పై రైడ్ చేసిన పోలీసులు ఏకంగా ముప్పై మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో గుత్తా సుమన్ కుమార్ అనే వ్యక్తి కీలకంగా మారాడు. ప్రస్తుతం ఈ వ్యవహారంలో విచారణ కొనసాగుతోంది. ఫార్మ్ కేసులో నాగ శౌర్య తండ్రి రవీంద్ర ప్రసాద్ కు నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాలని ఆదేశించారు పోలీసులు.
Read Also : నాగశౌర్య ఫామ్ హౌజ్ లో జూదం… రిమాండ్ కు తరలింపు
త్వరలోనే రెంటల్ అగ్రిమెంట్ తో పోలీసుల ముందు హాజరు కానున్నారు నాగ శౌర్య తండ్రి. ప్రధాన నిందితుడు గుత్తా సుమన్… రవీంద్ర ప్రసాద్ వద్ద విల్లాను ఒక రోజుకి అద్దెకు తీసుకున్నట్టు సమాచారం. బర్త్ డే పార్టీ పేరుతో విల్లా ను అద్దెకు తీసుకున్న సుమన్ అక్కడ జూదాన్ని నిర్వహించి అడ్డంగా దొరికిపోయాడు. అయితే ఈ వ్యవహారం అంతా నాగశౌర్య తండ్రి రవీంద్ర ప్రసాద్ కు తెలిసే జరిగిందా ? అనే అనుమానాలు వ్యక్తం అవుతుండగా, ఆ దిశలో విచారణ సాగిస్తున్నారు పోలీసులు.