బాలీవుడ్ లో కరోనా కలకలం సృష్టిస్తోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరసకు కరోనా బారిన పడుతున్నారు. నిన్నటికి నిన్న బోనీ కపూర్ ఫ్యామిలీ మొత్తం కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఇక తాజాగా మరో బాలీవుడ్ భామకు కరోనా పాజిటివ్ అని తేలింది. బాహుబలి చిత్రంలో మనోహరి సాంగ్ తో రచ్చ చేసిన నోరా ఫతేహి కరోనా బారిన పడింది. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలిపింది. ” హయ్ గయ్స్.. అనుకోకుండా నేను కరోనా బారిన పడ్డాను. ప్రస్తుతం నేను ఇంట్లోనే చికిత్స తీసుకొంటున్నాను. దయచేసి ఎవరు భయపడవద్దు. అందరు మాస్క్ లను ధరించండి. జీవితం కంటే ముఖ్యమైనది ఏదీ లేదు” అని చెప్పుకొచ్చింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని కామెంట్స్ పెడుతున్నారు. ఇటీవలే నోరా నటించిన డాన్స్ మేరీ రాణీ మ్యూజిక్ ఆల్బమ్ విడుదలై భారీ విజయాన్ని అందుకొంది.