జాతీయ ఉత్తమ నటి నిత్యామీనన్ తెలుగులో ఎందుకు సినిమాలు చేయట్లేదు, ఛాన్సులు రావట్లేదా, కథలు నచ్చట్లేదా, ఈ ఏడాది టాలీవుడ్ మాత్రమే కాదు, తమిళంలోనూ ఎందుకు పలకరించలేదో అమ్మడికే తెలియాలి. జాతీయ ఉత్తమ నటి నిత్యామీనన్ టాలీవుడ్ బిగ్ స్క్రీన్ పై కనిపించి రెండేళ్లు అయింది. టూ ఇయర్స్ బ్యాక్ పవరే స్టార్ పవన్ కళ్యాణ్ తో భీమ్లానాయక్ లో మెస్మరైజ్ చేసి, లాస్ట్ ఇయర్ కుమారి శ్రీమతి ఓటీటీతో సరిపెట్టేసింది.
Also Read : DREAMCATCHER : గ్రాండ్ గా డ్రీమ్ క్యాచర్’ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్
తమిళంలో గతంలో సినిమాలు చేసినా ధనుష్ తో చేసిన తిరుచిత్రాంబళం ఆమెకు స్పెషల్ మూవీగా మారిపోయింది. ఈ సినిమానే ఆమెకు నేషనల్ వైడ్ గుర్తింపు దక్కింది. అప్పటి నుండి ఎక్కువగా కోలీవుడ్‌తోనే టచ్‌లో ఉంటోంది ఈ బొద్దుగుమ్మ. కుమారి శ్రీమతి వెబ్ సిరీస్ సీజన్ 2 ఉన్నా అది చెయ్యట్లేదు. తెలుగులో కొత్త ప్రాజెక్టులేమీ ఒప్పుకోలేదు. దీంతో టాలీవుడ్ నుండి పిలుపు వస్తుందా రావట్లేదా అన్న డౌట్ కలుగుతోంది. కాల్ వస్తున్నా కథలు నచ్చట్లేదని సమాచారం. అంతేకాకుండా తమిళంలో బిజీగా ఉండటం వల్ల కాల్షీట్స్ కేటాయించలేక నయా ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదని టాక్ తెలుస్తోంది. ఈ ఏడాది ఒక్కటంటే ఒక్క సినిమాతో పలకరించని ఈ భామ చేతిలో నాలుగు ప్రాజెక్టులున్నాయి. అన్నీ కూడా తమిళ ఇండస్ట్రీకి చెందినవే. ఇవన్నీ సెట్స్ పై ఉండటంతోనే 2024 మిస్ అయ్యింది అమ్మడికి. జయం రవితో కాదలిక్క నేరమిల్లయ్, డియర్ ఎక్సెస్, ధనుష్‌తో ఇడ్లీ కడాయ్ తో పాటు మరో మూవీ చేస్తోంది. మరీ నెక్ట్స్ ఇయరైనా టాలీవుడ్ ప్రేక్షకులను పలకరిస్తుందో లేదో నిత్యా.