Nikita Roy and The Book of Darkness:
సీనియర్ బాలీవుడ్ నటుడు, రాజకీయ నేత శతృఘ్న సిన్హా కుమార్తె సోనాక్షి సిన్హా ఇప్పటికే హీరోయిన్ గా తనకంటూ ఓ గుర్తింపును హిందీ చిత్రసీమలో సంపాదించుకుంది. శతృఘ్న సిన్హా కవల పిల్లలు లవ్ అండ్ కుశ్ సైతం బాలీవుడ్ లోనే కొంతకాలంగా కొనసాగుతున్నారు. కుశ్ దర్శకత్వ శాఖలో మంచి పట్టు సంపాదించి, కొన్ని షార్ట్ ఫిల్మ్స్ ను డైరెక్ట్ చేశాడు. తాజాగా తన చెల్లి సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రధారిణిగా ఓ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నాడు. అతని డెబ్యూ మూవీకి ‘నికితారాయ్ అండ్ ది బుక్ ఆఫ్ డార్క్ నెస్’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. నిక్కీ భగ్నాని, విక్కీ భగ్నాని నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళబోతోంది. పరేశ్ రావెల్, సుహేల్ నయ్యర్ కీలక పాత్రలు పోషించే ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను బుధవారం విడుదల చేశారు. గతంలో కుశ్ తెరకెక్కించిన షార్ట్ ఫిల్మ్స్ కు అతని సోదరుడు లవ్ నిర్మాతగా వ్యవహరించాడు. మొత్తం మీద శతృఘ్న సిన్హా పిల్లలంతా బాలీవుడ్ లోనే కెరీర్ కొనసాగిస్తుండటం విశేషం.