Niharika : మెగా డాటర్ నిహారిక సినిమల పట్ల తనకున్న ఫ్యాషన్ ను చూపిస్తోంది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పేరుతో ఇప్పటికే సొంతంగా నిర్మాణ సంస్థను ఏర్పాటు ఏర్పాటు చేసింది. ఇందులో వరుసగా వెబ్ సిరీస్ లు నిర్మిస్తోంది. రీసెంట్ గానే ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమాను తీసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక తాజాగా తన బ్యానర్ లో భారీ సినిమా తీయడానికి రెడీ అవుతోంది. మానస శర్మ డైరెక్షన్ లో ఫీచర్ సినిమా తీయడానికి అన్నీ సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమాను కాస్త ఎక్కువ బడ్జెట్ తోనే తీస్తున్నారంట. కంటెంట్ ఉన్న సినిమాలనే ఎంచుకుంటోంది నిహారిక.
read also : Sudiksha Missing: సుదీక్ష తల్లిదండ్రుల నిర్ణయంతో అనుమానితుడికి విముక్తి
పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ లో మానస ఇప్పటికే రెండు సిరీస్ లను డైరెక్ట్ చేశారు. బెంచ్ లైఫ్, ఒక చిన్న ఫ్యామిలీ మంచి ఆదరణ దక్కించుకున్నాయి. ఆమె డైరెక్షన్ లో ఇప్పుడు ఫీచర్ ఫిల్మ్ రాబోతోంది. ఇందుల నటీనటులను త్వరలోనే ఫైనల్ చేయబోతున్నారు. నిహారిక ఈ సినిమాను ప్రత్యేకంగా తీసుకుంటుందంట. ఇందులో పెద్ద నటులు ఉండే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ సినిమా గనక హిట్ అయితే నిహారిక కూడా టాలీవుడ్ లో ప్రొడ్యూసర్ గా నిలదొక్కుకుంటుందని చెబుతున్నారు.