Koffee With Karan: బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్ షో కాఫీ విత్ కరణ్. మొదటి ఆరు సీజన్లను విజయవంతంగా పూర్తిచేసుకున్న ఈ షో ప్రస్తుతం ఏడవ సీజన్ ను కొనసాగిస్తోంది. ఈ ఏడు సీజన్ల నుంచి కరణ్ పద్ధతి మాత్రం అలాగే ఉంది అంటున్నారు నెటిజన్లు. ఇలా బహిరంగంగా అందరు చూస్తుండగా ఒక సెలబ్రిటీ ని వారి శృంగార జీవితం గురించి చెప్పమని అడగడం వారికి ఎంత ఎబెట్టుగా ఉంటుంది. ఆ మాత్రం కూడా తెలియదా..? అంటూ కరణ్ పై నెటిజన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటివరకు వచ్చిన ప్రతి స్టార్ ను మీ శృంగార జీవితం ఎలా ఉంది..? శృంగారంలో మీరు ఎంజాయ్ చేస్తున్నారా..? మీ పాట్నర్ తో మీకు ఎలాంటి శృంగారం ఇష్టం..? పెళ్ళి కానివాళ్ళు వస్తే.. ఇప్పటివరకు ఎంతమందితో శృంగారంలో పాల్గొన్నావ్..? ఇలాంటి ప్రశ్నలతో షో మొత్తం సెన్సార్ కట్లు వేసుకొనే పరిస్థితి వచ్చింది. అసలు ఈ షోలో ఈ శృంగారం గోల ఏంటి..? మారవా..? అంటూ కరణ్ ను ఏకిపారేస్తున్నారు.
ఇక తాజాగా కబీర్ సింగ్ జోడి ఈ షో లో హంగామా చేశారు. వారికి కూడా ఈ శృంగార ప్రశ్నలు ఎదురవడంతో నెటిజన్స్ షో చూడాలంటేనే చిరాకు వస్తుందని చెప్పుకొస్తున్నారు. ఇక మరికొంతమంది వేరేవాడి శృంగారంపై నీకెందుకు అంత ఇంట్రెస్ట్.. నువ్వు చేయడం లేదా..? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరు అసలు ఇలాంటి షోలను బ్యాన్ చేయాలంటూ చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది