శ్రీలీల తెలుగు ఇండస్ట్రీలోకి ఏ టైంలో ఎంటరైందో కానీ స్టార్ హీరోలతో జోడీ కట్టే ఛాన్స్ లు కొల్లగొట్టింది. లెస్ టైంలో టాలీవుడ్ సెన్సేషనల్ హీరోయిన్ అయ్యింది. అలాగే కో హీరోయిన్లకు కాంపిటీషనై కూర్చొంది. శ్రీలీల లైనప్ చూసి కుళ్లుకున్నారు ఎస్టాబ్లీష్ కావాల్సిన హీరోయిన్స్. త్రీ ఇయర్స్‌లోనే టాలీవుడ్ స్టార్ హీరోస్ బాలకృష్ణ, అల్లుఅర్జున్, మహేష్ బాబు, రవితేజ, రామ్, వైష్ణవ్ తేజ్, నితిన్లతో జోడీ కట్టింది డ్యాన్సింగ్ క్వీన్.కిస్సిక్ సాంగ్‌తో బాలీవుడ్‌ను కూడా ఎట్రాక్ట్ చేసిన శ్రీలీల.. అక్కడ కూడా ఆఫర్లను కొల్లగొడుతోంది. ఇప్పటికే కార్తీక్ ఆర్యన్‌తో జోడీ కడుతోంది భామ. అనురాగ్ బసు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న లవ్ అండ్ రొమాంటిక్ ప్రాజెక్టును దీవాళికి రిలీజ్ చేసే యోచనలో ఉన్నారు మేకర్స్.
Also Read : Exclusive: యంగ్ హీరోలు మారాల్సిందే.. లేదంటే భారీ మూల్యం తప్పదు
బాలీవుడ్‌లో పాగా వేసేందుకు ట్రై చేస్తోంది బ్యూటీ. నార్త్‌లో దూసుకెళ్లిపోదామనుకున్న శ్రీలీల దూకుడుకు బ్రేకులేసింది స్టార్ హీరోయిన్ రవీనా టాండన్ డాటర్ రాషా తడానీ. రీసెంట్లీ ఆజాద్ మూవీతో పలకరించిన ఈ బ్యూటీ ఇప్పుడు శ్రీలీల బాలీవుడ్ ఆఫర్‌ను తన్నుకుపోయిందని అక్కడ సర్కిల్స్‌లో గట్టి బజ్ నడుస్తోంది. 2019లో కార్తీక్ ఆర్యన్- భూమి పడ్నేకర్ జంటగా నటించిన పతి పత్నీ ఔర్ ఓ సీక్వెల్లో ఫస్ట్ శ్రీలీలను అనుకున్నారట మేకర్స్. కానీ ఆమె ప్లేసులోకి రాషా తడానీని తీసుకోవాలనుకుంటున్నారని టాక్. ఇప్పటికే తెలుగులో నవీన్ పోలిశెట్టి హీరోగా తెరకెక్కుతోన్న అనగనగా ఒక రాజు సినిమాలో శ్రీలీలనే ఫస్ట్ ఛాయిస్ అనుకుంటే స్టడీస్, ఇతర సినిమాల డేట్స్ అడ్జెస్ట్ చేయలేక ఆ ప్రాజెక్ట్ నుండి డ్యాన్సింగ్ క్వీన్ తప్పుకుంటే మీనాక్షి చెంతకు ఆఫర్ చేరింది. ఇప్పుడు కార్తీక్ ఆర్యన్‌తో సెకండ్ టైం నటించే ఛాన్స్ మిస్ చేసుకున్నదని టాక్. ఇప్పటి వరకు ఇతర భామల ఆఫర్లను మేడమ్ తన్నుకుపోతే ఇప్పుడు శ్రీలీల ఆఫర్లను అనదర్ బ్యూటీస్ ఎత్తుకెళ్లిపోవడం ఓ టాపిక్ అయిపోయింది