Nelson Dilipkumar: సినిమా హిట్ లేదా ప్లాప్ అనేది కథ కథనాలతో పాటు స్క్రీన్ ప్లే, డైరెక్షన్ పై ఆధారపడిఉంటుంది. ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరో సినిమా హిట్ అయితే అది హీరో ఖాతాలోకి వెళ్ళిపోతోంది. అదే ప్లాప్ అయితే డైరెక్టర్ ఖాతాలోకి వెళ్తోంది. ఇది చాలా ఏళ్లుగా కొనసాగుతున్న విషయం. ఇక ఈసారి మాత్రం సినిమా హిట్ అయ్యాకా.. హీరోతో పాటు సమానంగా డైరెక్టర్ ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఆ డైరెక్టర్ ఎవరో కాదు నెల్సన్ దిలీప్ కుమార్. 2018 లో కోలమావు కోకిల అనే సినిమాతో నెల్సన్ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. నయనతార హీరోయిన్ గా నటించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా తరువాత డాక్టర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నెల్సన్. ఈ సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంది. వరుసగా రెండు సినిమాలు విజయాలను అందుకోవడంతో స్టార్ హీరోల కంట్లో పడ్డాడు నెల్సన్. మూడో సినిమానే ఇళయదళపతి విజయ్ ను డైరెక్ట్ చేసే అవకాశాన్ని అందుకున్నాడు. బీస్ట్ గా విజయ్ ను చూపించాడు. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా పరాజయాన్ని చవిచూసింది. అంతకుముందు రెండు హిట్స్ తీసిన డైరెక్టర్ యేనా ఈ సినిమాకు దర్శకత్వం వహించింది. స్క్రీన్ ప్లే బాగోలేదు, డైరెక్షన్ అస్సలు బాగోలేదని ముఖం మీదే చీవాట్లు పెట్టారు అభిమానులు.
KOK Trailer: ట్రైలర్ తోనే ఇంటెన్స్ గ్యాంగ్ స్టర్ డ్రామా చూపించారు
ఇక బీస్ట్ సినిమా రిలీజ్ కాకముందే నెల్సన్ కు రజినీకాంత్ పిలిచి మరీ అవకాశం ఇచ్చారు. నెల్సన్ లో ఉన్న ట్యాలెంట్ ఏంటి అనేది రజినీ చూసారు. ఇక బీస్ట్ రిలీజ్ అయ్యి ప్లాప్ అయ్యాక రజినీ అభిమానులు.. నెల్సన్ తో సినిమా వద్దని, రజినీకి కూడా బీస్ట్ లాంటి పరాజయాన్ని అందిస్తాడని భయపెట్టారు. ఈ డైరెక్టర్ వేస్ట్.. రజినీ సినిమాను పాడు చేస్తాడు అన్నారు. కానీ, రజినీ ఆ మాటలను పట్టించుకోలేదు. ఎవరు ఎన్ని అన్నా.. జైలర్ కథను తలైవా నమ్మారు. అన్నింటికి మించి ఇచ్చినమాటను తప్పకుండ నెల్సన్ తో సినిమా చేసి సూపర్ స్టార్ హిట్ కొట్టాడు. అప్పుడు ఏ డైరెక్టర్ అయితే వేస్ట్.. రజినీ సినిమాను పాడు చేస్తాడు అన్నారో.. ఇప్పుడు అదే అభిమానులు నెల్సన్ కు గుడి కట్టినా తప్పులేదు అని చెప్పుకొస్తున్నారు. మరి ఈ సినిమా తరువాత నెల్సన్ రేంజ్.. ఏ రేంజ్ లో పెరుగుతుందో చూడాలి.