2018లో మాస్ మహారాజ రవితేజ నటించిన ‘నేల టికెట్’ సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ ‘మాళవిక శర్మ’. మొదటి సినిమాలో క్యూట్ గా కనిపించి యూత్ ని అట్రాక్ట్ చేసిన ఈ హీరోయిన్ కెరీర్ బాగుంటుందని అంతా అనుకున్నారు కానీ నెల టికెట్ సినిమా ఫ్లాప్ అవ్వడంతో మాళవిక శర్మకి సినీ ఇండస్ట్రీలో అవకాశాలు కరువయ్యాయి. దీంతో మూడేళ్ల పాటు వెండితెరపై కనిపించని మాళవిక శర్మ, 2021లో మళ్లీ రామ్ పోతినేని నటించిన ‘రెడ్’ సినిమాతో హీరోయిన్ ప్రేక్షకులని పలకరించింది. ఈ సినిమా కూడా ఆశించిన రిజల్ట్ రాబట్టలేక పోవడంతో మాళవిక శర్మకి టాలీవుడ్ దాదాపు గుడ్ బాయ్ చెప్పేసింది. తమిళ్ లో లో కూడా ‘కాఫీ విత్ కాదల్’ సినిమాతో మాళవిక శర్మ తన లక్ ని టెస్ట్ చేసుకుంది కానీ అక్కడ కూడా మేడమ్ కి హిట్ దొరకలేదు. ‘లా’ స్టూడెంట్ అయిన మాళవిక, నెల టికెట్ సినిమా తర్వాత తన చదువు కోసం గ్యాప్ తీసుకోవడమే ఆమె కెరీర్ కి కష్టాల్లో పడేసింది అనే విమర్శ కూడా ఉంది.
ఇటివలే తన చదువు పూర్తి చేసుకున్న మాళవిక శర్మ మళ్లీ సినీ ప్రయాణం మొదలుపెట్టాలని చూస్తున్నట్లు ఉంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మాళవిక శర్మ, ఇండస్ట్రీలోకి ట్రై చేస్తున్నట్లు హింట్ ఇస్తూ ఫోటోలని పోస్ట్ చేస్తోంది. కెరీర్ స్టార్టింగ్ లో కాస్త బొద్దుగా కనిపించిన మాళవిక శర్మ ఇప్పుడు బాగా స్లిమ్ అయ్యి ఫిట్ గా రెడీ అయ్యిందని ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు చూస్తేనే అర్ధమవుతోంది. ప్రస్తుతానికి మాళవిక శర్మ చేతిలో సల్మాన్ ఖాన్ నటిస్తున్న ‘కిసీ కా భాయ్, కిసీ కా జాన్’ సినిమా మాత్రమే ఉంది. ఈ మూవీ హిట్ అయితే బాలీవుడ్ లో మాళవిక శర్మకి మంచి అవకాశాలు వస్తాయి లేదంటే సౌత్ లాగే నార్త్ లో కూడా అమ్మడి కెరీర్ కష్టాల్లో పడుతుంది. ‘కిసీ కా భాయ్, కిసీ కా జాన్’ సినిమా రిలీజ్ అయ్యే లోపు తెలుగులో ఒక మంచి అవకాశం వస్తే మళ్లీ తన కెరీర్ గాడిన పడుతుందని మాళవిక శర్మ నమ్ముతోంది. మరి ఈ హీరోయిన్ ని ఒక హిట్ సినిమాలో ఛాన్స్ ఇచ్చే ఆ హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఎవరో చూడాలి.