NBK107 సినిమా సెట్స్ మీదకి వెళ్లినప్పటి నుంచి.. గ్యాప్ లేకుండా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. మేకర్స్ కూడా అంతే వేగంగా ఒకదాని తర్వాత మరొక అప్డేట్స్ ఇస్తున్నారు. షూటింగ్ మొదలైన రెండో రోజే ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారంటే, టీమ్ ఎంత ఫాస్ట్‌గా వర్క్ చేస్తోందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఏకంగా టీజర్ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అవును, మీరు చదువుతోంది అక్షరాల నిజం.
ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోన్న వార్తల ప్రకారం.. జూన్ 10వ తేదీన ఈ టీజర్‌ను విడుదల చేయనున్నారట! ఈ టీజర్ హై-వోల్టేజ్ యాక్షన్‌తో నిండి ఉంటుందని, బాలయ్య ఫ్యాన్స్‌కి ఫుల్ మీల్స్ ఇవ్వడం ఖాయమని సమాచారం. వీరోచితమైన డైలాగ్స్ కూడా ఉండనున్నాయట! ఈ టీజర్‌లోనే టైటిల్‌ని అనౌన్స్ చేయనున్నట్టు టాక్ వినిపిస్తోంది. రీసెంట్‌గా చిత్రబృందం.. చేత కత్తి పట్టుకొని ఊరమాస్ లుక్‌లో ఉన్న బాలయ్య పోస్టర్‌ని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే! అదే జోష్‌లో టీజర్‌ని విడుదల చేయాలని మేకర్స్ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ ఔట్ అండ్ ఔట్ యాక్షన్ డ్రామాలో శృతి హాసన్ కథానాయికగా నటిస్తుండగా.. కన్నడ నటుడు దునియా విజయ్ విలన్‌గా నటిస్తున్నాడు. వరలక్ష్మి శరత్‌కుమార్ సైతం ఇందులో ఓ కీలక పాత్ర పోషిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.