Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nayanthara: సౌత్ ఇండియన్ సినీ పరిశ్రమలో తిరుగులేని క్రేజ్ సంపాదించుకుని ‘లేడీ సూపర్ స్టార్’గా వెలుగొందుతున్న నయనతార గురించి పరిచయం అక్కర్లేదు. స్టార్ హీరోయిన్గా సినిమాకు రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్ల దాకా పారితోషికం అందుకుంటూ దక్షిణాదిలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే నటిగా రికార్డు సృష్టించారు. అయితే హీరోయిన్గా ఇండస్ట్రీని ఏలుతున్న నయనతారకు నిర్మాతగా మాత్రం అస్సలు అదృష్టం కలిసిరావడం లేదు. నటిగా సంపాదించిన కోట్ల రూపాయలను సినిమా నిర్మాణంలో పెట్టి దారుణంగా నష్టపోతున్నారన్న వార్తలు ప్రస్తుతం కోలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు హాట్ టాపిక్‌గా మారాయి. వరుస పరాజయాల దెబ్బతో ఇకపై నిర్మాతగా చేతులు కాల్చుకోకూడదని ఆమె సంచలన నిర్ణయం తీసుకున్నట్లు ఫిలింనగర్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.
హీరోయిన్గా ఎన్నో బ్లాక్బస్టర్లను ఖాతాలో వేసుకున్న నయన్.. నిర్మాతగా మాత్రం సరైన సబ్జెక్టులను ఎంచుకోవడంలో తీవ్రంగా తడబడుతున్నారు. నిర్మాణ బాధ్యతలను భర్త విగ్నేష్ శివన్ చూసుకుంటున్నప్పటికీ, వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా కొడుతున్నాయి. ముఖ్యంగా బయట అవకాశాలు పెద్దగా లేని సమయంలో తన భర్త విగ్నేష్ శివన్‌ను దర్శకుడిగా నిలబెట్టాలన్న తాపత్రయంతో నయనతార భారీగా పెట్టుబడులు పెడుతూ వచ్చారు. వరుస హిట్స్‌తో మంచి జోరుమీదున్న ప్రదీప్ రంగనాథన్‌తో విగ్నేష్ డైరెక్షన్లో ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ చిత్రాన్ని నిర్మించగా, అది ఆశించిన రిజల్ట్ ఇవ్వలేకపోయింది. ఇటీవల కవిన్, నయనతార జంటగా నటించిన ‘హాయి’ అనే తమిళ చిత్రాన్ని విగ్నేష్ శివన్, ఎస్ఎస్ లలిత్ కుమార్‌లతో కలిసి నయనతార నిర్మించారు. రొటీన్ లవ్ స్టోరీ కావడంతో ప్రేక్షకులు ఈ సినిమాను తిరస్కరించారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.14 కోట్లకు బిజినెస్ జరిగితే, బాక్సాఫీస్ వద్ద కేవలం రూ.5 కోట్లు మాత్రమే వసూలు చేసి బయ్యర్లకు, నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చింది. ఈ ఎదురుదెబ్బతో నయన్ తీవ్ర నిరాశకు గురైనట్లు సమాచారం.
Also Read
- The Paradise: అనిరుధ్ స్టూడియో నుంచి నాని ‘చిన్న లీక్’.. ‘ది ప్యారడైజ్’ 3rd సింగిల్‌పై క్రేజీ వీడియో వైరల్! చూశారా
- Chiru Leaks: 'కాకా'లో అసలు క్యారెక్టర్ పేరు చెప్పేసిన మెగాస్టార్.. ఫ్యాన్స్‌కి పూనకాలే!
- Itlu Arjuna Teaser: మాటల్లేవ్... మాట్లాడుకోవడాలు లేవ్... డైలాగ్స్ లేకుండానే అనీష్ నటన అదుర్స్..
- Sangeet First Single: ఏఆర్ రెహమాన్ చేతుల మీదుగా ‘నీ వల్లే’ సాంగ్ రిలీజ్.. సిద్ శ్రీరామ్ మెలోడీకి ఫిదా అవుతున్న ఫ్యాన్స్!
2021లో ‘నెట్రికన్’ సినిమాతో నిర్మాతగా ప్రయాణం ప్రారంభించిన నయనతారకు ఆరంభం నుంచే చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. గతంలో విజయ్ సేతుపతి, సమంతలతో కలిసి నటించిన ‘కేఆర్కే’ మిశ్రమ స్పందన తెచ్చుకుని కమర్షియల్‌గా కాస్త గట్టెక్కినప్పటికీ, ఆ తర్వాత వచ్చిన ఏ ప్రాజెక్టూ సేఫ్ కాలేదు. నాలుగేళ్ల క్రితం విడుదలైన ‘కనెక్ట్’ సినిమా అయితే అసలు థియేటర్లలోకి ఎప్పుడు వచ్చిందో, ఎప్పుడు వెళ్లిందో కూడా ప్రేక్షకులకు తెలియలేదు. సాధారణంగా తన సొంత సినిమాల ప్రమోషన్లకు కూడా రాని నయనతార.. ‘కనెక్ట్’ కోసం ప్రత్యేకంగా తెలుగులో విస్తృత ప్రచారం చేసినా ఫలితం దక్కలేదు. హీరోయిన్గా కష్టపడి సంపాదించిన డబ్బునంతా ప్రొడక్షన్ కంపెనీలో పోగొట్టుకుంటున్నానని గ్రహించిన నయనతార.. ఇకపై ఎలాంటి పరిస్థితుల్లోనూ సినిమాలను నిర్మించకూడదని గట్టి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కేవలం నటిగా మాత్రమే కొనసాగుతూ రెమ్యునరేషన్ తీసుకోవడం ఉత్తమమని ఆమె భావిస్తున్నారట. ప్రస్తుతం ఆమె డైరీ పూర్తిగా బిజీగా ఉంది. హిందీలో సల్మాన్ ఖాన్ చిత్రంతో పాటు తమిళంలో నాలుగు, మలయాళంలో ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో నటిస్తూ బిజీగా ఉన్న నయన్.. ఇకపై నటనకే పూర్తి సమయం కేటాయించాలని డిసైడ్ అయ్యారని తెలుస్తోంది.
తాజావార్తలు
-
CM Chandrababu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసరాల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్..
-
Upcoming IPOs : వచ్చే వారం మార్కెట్లో ఐపీఓల జాతర.. ఏకంగా 19 కంపెనీల ఎంట్రీ! పూర్తి వివరాలు ఇవే..
-
Botsa Satyanarayana: 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం.. ఒకరు పోతే వంద మంది వస్తారు…
-
Harish Rao : రాష్ట్రంలో రైతు రాజ్యం పోయి రాక్షస రాజ్యం వచ్చింది
-
UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!