Sangeet First Single: ఏఆర్ రెహమాన్ చేతుల మీదుగా ‘నీ వల్లే’ సాంగ్ రిలీజ్.. సిద్ శ్రీరామ్ మెలోడీకి ఫిదా అవుతున్న ఫ్యాన్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sangeet First Single: ప్రముఖ డిజిటల్ ఇన్ఫ్లుయెన్సర్, పాడ్‌కాస్ట్ హోస్ట్ నిఖిల్ విజయేంద్ర సింహా హీరోగా పరిచయమవుతున్న లేటెస్ట్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘సంగీత్’ (Sangeet) నుండి మొదటి సింగిల్ ‘నీ వల్లే’ సాంగ్ నిన్న (2026 సెప్టెంబర్ 19న) ఆఫీషియల్ గా విడుదలైంది. ఆస్కార్ అవార్డ్ విజేత, లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎ.ఆర్. రెహమాన్ సోషల్ మీడియా ద్వారా ఈ పాటను ఆవిష్కరించి సినిమా టీమ్ బెస్ట్ విషెస్ తెలియజేశారు. సోషల్ మీడియాలో తనకంటూ ఒక ప్రత్యేక క్రేజ్ సంపాదించుకున్న నిఖిల్ ఈ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమవుతుండటంతో ఆయన అభిమానులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ మధురమైన రొమాంటిక్ మెలోడీ సాంగ్‌కు ప్రముఖ సంగీత దర్శకుడు అచు రాజామణి స్వరకల్పన చేయగా, యువతకు ఎంతో ఇష్టమైన సింగర్ సిద్ శ్రీరామ్ తన మాయా గాత్రంతో ఈ మెలోడీని అద్భుతంగా ఆలపించారు. విక్రమ్ శివ అందించిన వినసొంపైన సాహిత్యం ఈ లవ్ ట్రాక్‌ను మరింత స్పెషల్ గా మార్చింది. ఇందులో హీరోగా పరిచయమవుతున్న నిఖిల్, తమిళ నటి తేజు అశ్విని ల మధ్య ఉన్న లవ్ జర్నీని, వారి క్యూట్ కెమిస్ట్రీని విజువల్ గా చాలా బ్యూటిఫుల్ గా స్క్రీన్‌పై ప్రెజెంట్ చేశారు.
ఈ సినిమాతోనే తేజు అశ్విని కూడా టాలీవుడ్లోకి అడుగుపెడుతోంది. చెన్నైలో పుట్టి పెరిగిన ఈమె మొదట యూట్యూబ్ వెబ్ సిరీస్‌లు, మోడలింగ్ ద్వారా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత సంతానం నటించిన ‘పారిస్ జయరాజ్’ అశ్విన్ కుమార్ సరసన ‘ఎన్న సొల్ల పొగిరాయ్’ వంటి చిత్రాలతో వెండితెరకు పరిచయమైంది. అలాగే కెవిన్‌తో కలిసి ఆమె చేసిన ‘అస్కు మారో’ మ్యూజిక్ వీడియో యూట్యూబ్‌లో వందల మిలియన్ల వ్యూస్ సాధించి ఆమెను సోషల్ మీడియాలో మరింత పాపులర్ చేయగా, ప్రస్తుతం ‘సంగీత్’ సినిమాలోని ‘నీ వల్లే’ మెలోడీ సాంగ్ ద్వారా తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో తెలుగు ప్రేక్షకులను కూడా అలరిస్తోంది. లహరి ఫిల్మ్స్, ఆర్బీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ మూవీకి ప్రముఖ కన్నడ దర్శకుడు సాద్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ క్రేజీ అండ్ హిలేరియస్ ఫ్యామిలీ డ్రామా ప్రతి ఒక్కరినీ అలరిస్తుందని మేకర్స్ ప్రెస్ మీట్లో కూడా ధీమా వ్యక్తం చేశారు. నిన్న విడుదలైన ‘నీ వల్లే’ సాంగ్ యూట్యూబ్‌లో మంచి వ్యూస్, రెస్పాన్స్‌తో ప్రస్తుతం ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. పెళ్లిళ్ల సీజన్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ హిలేరియస్ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాను ఈ ఏడాది నవంబర్ లేదా డిసెంబర్ నెలల్లో థియేటర్లలో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్లు ఇండస్ట్రీ టాక్. త్వరలోనే మేకర్స్ ఈ మూవీ టీజర్, రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయనున్నారు.
Also Read
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
- Ranabali Trailer: తెల్లదొరల గుండెల్లో సింగనమల బొబ్బిలి నిప్పులు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న 'రణబాలి' ట్రైలర్!
తాజావార్తలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
-
OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
-
OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
-
OTR: నెలకు ₹2,000 కోట్లు! చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ఇదేనా?
-
US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!