Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం ఒకపక్క వైవాహిక జీవితాన్ని, మరోపక్క మాతృత్వ మధురిమలను ఆస్వాదిస్తోంది. ఇక వీటితో పాటు తన కెరీర్ ను కూడా బిల్డ్ చేసుకొంటుంది. ప్రస్తుతం నయన్ నటించిన హర్రర్ థ్రిల్లర్ కనెక్ట్ సినిమా నేడు రిలీజై పాజిటివ్ టాక్ అందుకొంటుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ కు హాజరైన నయన్ తెలుగు హీరోల గురించి తనదైన స్టైల్లో చెప్పుకొచ్చింది. ముఖ్యంగా బాలకృష్ణ గురించి నయన్ చెప్పిన మాటలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు ప్రభాస్ బ్రాండ్.. హీరోలు బ్రాండ్స్ అని చెప్పుకుంటున్నారు. కానీ వారి అందరికన్నా ముందు బాలయ్య పెద్ద బ్రాండ్.. ఆయన చాలా స్వీట్ పర్సన్.. ఆయనను చూడడానికి, మాట్లాడానికి అందరు భయపడతారు.. బాలకృష్ణ గారితో మరో టేక్ అడిగేందుకు ప్రతి ఒక్కరు భయపడుతారు.
బాలకృష్ణ గారి ముందు ముందు చెమటలు కక్కుతూ వచ్చి తడబడుతూ ఉంటారు.. అప్పుడు బాలకృష్ణ గారు ఏమైంది అని అడిగితె .. ఫోకస్ లేదండి మరో టెక్ చేద్దాం అని చెప్పగానే. వెంటనే ఓకే ఇంకో షాట్ చేద్దాం అనేవారు. ఆయన చాలా హ్యాపీ పర్సన్. ఆయనతో కలిసి మూడు సినిమాలు చేశాను. ఆయనతో వర్క్ చాలా జాలీగా ఉంటుంది” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుత, నయన్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.