Navadeep: డైరెక్టర్ తేజ పరిచయం చేసిన హీరోల్లో నవదీప్ ఒకడు. ప్రస్తుతం స్టార్ హీరో అని అనిపించుకోపోయినా మంచి నటుడిగా గుర్తింపు అయితే తెచ్చుకున్నాడు. ఇక సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూనే హీరోగా నటిస్తున్నాడు. ఇంకోపక్క వెబ్ సిరీస్ లతో కూడా తన సత్తా చాటుతున్నాడు. ఇక సోషల్ మీడియాలో నవదీప్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా తన ఫోటోలకు తెలుగులో మంచి మంచి క్యాప్షన్స్ పెడుతూ అలరిస్తూ ఉంటాడు. వాటికే ఫ్యాన్స్ ఎట్రాక్ట్ అవుతూ ఉంటారు. ఇక ప్రస్తుతం నవదీప్.. న్యూసెన్స్ అనే వెబ్ సిరీస్ లో నటించాడు. సరే ప్రవీణ్ కుమార్ దర్శకత్వంలో ఈ సిరీస్ తెరకెక్కింది. ఇక ఇందులో నవదీప్ సరసన బింధుమాధవి నటిస్తోంది. పక్కా పొలిటికల్ డ్రామాగా ఈ సిరీస్ ను తెరక్కించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
Director Teja: ఆ విషయంలో ప్రభాస్ 1000 రేట్లు గొప్పోడు
ఇక ఈ సిరీస్ ఆహా ఓటిటీలో మే 12 నుంచి స్ట్రీమింగ్ కానుంది. రిలీజ్ డేట్స్ దగ్గరపడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ పెంచేశాడు నవదీప్. నిత్యం ఏదో ఫోటోను షేర్ చేస్తూ న్యూసెన్స్ చేయడం మొదలుపెట్టాడు. తాజాగా ట్విట్టర్ లో ఒక ఫోటోను షేర్ చేశాడు. చెస్ రెండు వైపులా తనే ఆడుతూ కనిపించాడు. ఇక దీనికి క్యాప్షన్ గా.. ” నేనే రాజు.. నేనే కంత్రీ.. మే 12 న న్యూసెన్స్ ఆహాలో రిలీజ్ అవుతుంది అని చెప్పుకొచ్చాడు. ఈ సిరీస్ లో నవదీప్ మీడియా జర్నలిస్ట్ గా నటిసున్నాడు. దాన్ని కన్వే చేస్తూ.. రాజకీయ చదరంగంలో పాములనుకదిపి ఆడించే కింగ్ మేకర్ నేనే అన్నట్లు చెప్పుకొచ్చాడు. ఇక ఈ ఫోటో చూసిన అభిమానులు.. అన్నా.. నీ క్యాప్షన్స్ మాత్రం సూపర్ ఉంటాయి ఉంటాయి అని కొందరు, ఈ సిరీస్ సూపర్ హిట్ అవ్వాలని కొందరు కోరుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ సిరీస్ ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి.
Nene Raju Nene kantri 😉 #newsense on may12th @ahavideoIN pic.twitter.com/g3tsIXltiX
— Navdeep (@pnavdeep26) April 29, 2023