Director Teja: టాలీవుడ్ లో ఇప్పుడున్న స్టార్ హీరోలను పరిచయం చేసిన డైరెక్టర్ తేజ. ఉదయ్ కిరణ్ దగ్గరనుంచి నవదీప్ కాదు, రానా తమ్ముడు అభిరామ్ వరకు ఆయన పరిచయం చేసిన హీరోలందరూ ప్రస్తుతం మంచి పొజిషన్ లోనే ఉన్నారు. తేజ మాట నిక్కచ్చిగా మాట్లాడతాడు. మనసులో ఒకలా.. అందరి ముందు ఒకలా మాట్లాడే మనిషి కాదు తేజ. అయితే దాన్ని చాలామంది పొగరు అంటారు. కానీ, అలాంటివేమీ పట్టించుకోకుండా తనకు ఏది అనిపిస్తే అది చెప్పేస్తూ ఉంటాడు. ప్రస్తుతం తేజకు ఇండస్ట్రీలో గ్యాప్ వచ్చింది. ఆయన చేతిలో అభిరామ్ అహింస ఒక్కటే ఉంది. ఇక తాజా తేజ.. గోపీచంద్ నటించిన రామబాణం ప్రమోషన్స్ లో భాగమయ్యాడు. తన జయం సినిమాతో విలన్ గా గోపీచంద్ ను పరిచయం చేసిన తేజ .. ఆప్పటినుంచి ఇప్పటివరకు గోపీచంద్ కు అండగా ఉంటూనే వస్తున్నాడు. ఇక తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా గోపీచంద్ ను ఇంటర్వ్యూ చేశాడు తేజ. ఈ ఇంటర్వ్యూలో గోపీచంద్ అడిగిన ప్రశ్నలకు తేజ.. తేజ అడిగిన ప్రశ్నలకు గోపీచంద్ తమదైన శైలిలో సమాధానాలు చెప్పుకొచ్చారు.
Agent: రెండో రోజే పాతాళానికి అఖిల్ మూవీ… మరీ ఇంత దారుణంగానా?
గోపీచంద్.. తనను జయంలో తీసుకోవడానికి కారణం ఎవరు..? ఎవరు రికమెండ్ చేశారు..? అని అడుగగా.. తేజ మాట్లాడుతూ.. ” మీ నాన్న టి. కృష్ణ. ఆయన దగ్గర నేను పనిచేశాను. ఆయన అంటే అందరికి ఇష్టమే. అందరు చెప్తుంటారు. తల్లిదండ్రులు చేసిన పుణ్యం పిల్లలకు వస్తుందని. ఆయన చేసిన మంచి.. నీకు ఛాన్స్ వచ్చేలా చేసింది. అయితే నేను కేవలం రోడ్డును.. ఆ గోల్ వరకు తీసుకెళ్లడానికి ఆయనే కారణం.. ఆయనకున్న మంచి ప్రవర్తన. అలా రేపు నీ పిల్లలకు చెప్పుకోవడానికి ఏముంది.. నీ పిల్లలకు వాల్యూ రావడం కోసం నువ్వేం చేశావ్.. నేను కృష్ణంరాజు దగ్గర పనిచేశాను. బయట కూడా వింటూ ఉంటాను. ప్రభాస్.. 1000 రేట్లు మంచివాడు.. ఒక మంచి మనిషి.. అతనికి విబేధాలు ఉండవు. ప్రభాస్ కు మంచి పేరు ఉంది. ఇండస్ట్రీలో కానీ, బయట కానీ అతనిని అందరు ఇష్టపడతారు. అలానే మీ నాన్నగారిని కూడా అందరు ఇష్టపడతారు. ఆయనను ఎవరైనా ఏదైనా అంటే అస్సలు ఊరుకోరు. ఆ గుడ్ విల్ నీకు పనిచేసింది. ఆయనలానే నువ్వు కూడా మంచి పేరు తెచ్చుకోవాలని నా కోరిక” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.