‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమా నుంచి నేచురల్ స్టార్ నాని ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. వైవిధ్యభరితమైన సినిమాలతో ఒకదానికి మించి మరొక హిట్ అందుకుంటూ దూసుకుపోతున్నాడు. రీసెంట్‌గా ‘వీ, టక్ జగదీశ్’ సినిమాలతో నిరాశపరిచినా.. ‘శ్యామ్ సింగ రాయ్’తో తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. ఈ నేపథ్యంలోనే నాని క్రేజీ ప్రాజెక్టుల్ని వరుసగా లైన్‌లో పెడుతున్నాడు. ‘అంటే సుందరానికీ’ సినిమాతో త్వరలోనే మన ముందుకు రాబోతున్న నాని, ‘దసరా’ షూటింగ్‌లోనూ బిజీగా ఉన్నాడు. ఇప్పుడు లేటెస్ట్‌గా ఓ క్రేజీ దర్శకుడితో జత కట్టబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఆ దర్శకుడు మరెవ్వరో కాదు.. కేజీఎఫ్‌తో సంచలనాలు సృష్టించిన ప్రశాంత్ నీల్.
ఈమధ్యే ఈ ఇద్దరి మధ్య కథాచర్చలు జరిగాయని.. ప్రశాంత్ నీల్ నరేట్ చేసిన స్టోరీ విపరీతంగా నచ్చడంతో నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ప్రచారం జరుగుతోంది. NTR31 ప్రాజెక్ట్ తర్వాత దీన్ని సెట్స్ మీదకి తీసుకువెళ్ళనున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే, దీన్ని అతి తక్కువ సమయంలోనే ముగించేలా ప్లాన్ చేస్తున్నారట! పాన్ ఇండియా సినిమానే అయినా, మరీ ఎక్కువ సమయం కేటాయించకుండా, అనతికాలంలోనే ఫినిష్ చేసేలా ప్రణాళికలు వేస్తున్నారని వార్తలొస్తున్నాయి. అయితే, ఈ కాంబోపై అధికార ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ ఇది నిజమే అయితే, ఈ చిత్రంతో నాని కెరీర్ మలుపు తిరగడం ఖాయం. అతడు పాన్ ఇండియా స్టార్‌గా అవతరిస్తాడని చెప్పుకోవడంలో సందేహమే లేదు.