71వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను (2023) కేంద్రం ప్రకటించింది. ఉత్తమ తెలుగు చిత్రంగా నందమూరి బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ నిలిచింది. స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో శ్రీలీల, కాజల్ అగర్వాల్ కీలక పాత్రలు పోషించారు. భగవంత్ కేసరి సినిమాకు అవార్డు రావడంతో బాలయ్య బాబు ఫ్యాన్ సంబరాలు చేసుకుంటున్నారు. ‘జై బాలయ్య’ అంటూ సోషల్ మీడియాలో హ్యాష్ టాగ్ ట్రెండ్ అవుతోంది. 2023 సంవత్సరానికి జ్యూరీ జాతీయ చలనచిత్ర అవార్డ్స్ ప్రకటించింది.
Also Read: ENG vs IND: టీ20 తరహా బ్యాటింగ్.. లంచ్ బ్రేక్‌కి ఇంగ్లండ్ స్కోర్ ఎంతంటే?
2023లో దేశవ్యాప్తంగా విడుదలైన వందలాది సినిమాల నుంచి అందిన నామినేషన్లను జ్యూరీ సభ్యులు పరిశీలించి.. విజేతలను ఎంపిక చేశారు. న్యూఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్‌లో కేంద్ర ప్రభుత్వం అవార్డులను ప్రకటించింది. కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ విజేతల వివరాలను వెల్లడించారు. సినిమా ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డు ‘భగవంత్ కేసరి’ని దక్కడంతో ఫాన్స్ ఆనందిస్తున్నారు. బాలయ్య బాబుకు అందరూ విషెష్ తెలుపుతున్నారు.