ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా లండన్‌లోని ఓవల్ క్రికెట్ గ్రౌండ్‌లో భారత్‌తో జరుగుతున్న ఐదవ టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టీ20 తరహా బ్యాటింగ్ చేస్తోంది. ఇంగ్లండ్ టీమ్ ఇటీవలి కాలంలో ఆడుతున్న ‘బజ్‌బాల్’ ఆటను ఈ మ్యాచ్‌లో కొనసాగిస్తోంది. రెండో రోజు లంచ్ బ్రేక్ సమయానికి 16 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 109 పరుగులు చేసింది. క్రీజులో జాక్ క్రాలే (52), ఓలీ పోప్ (12) ఉన్నారు. బెన్ డకెట్ 38 బంతుల్లో 43 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. డకెట్ 5 ఫోర్లు, 2 సిక్సులు బాదాడు. ఇంగ్లండ్ ఇంకా కేవలం 115 పరుగుల వెనకంజలో మాత్రమే ఉంది.
Also Read: Box Office War: బాక్సాఫీస్ వార్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్.. రెండు సినిమాల్లో ఏది పేలుతుందో!
తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 224 పరుగులకు ఆలౌటైంది. ఓవర్ నైట్ స్కోర్ 204/6తో రెండో రోజు ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్.. కేవలం 20 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. కరుణ్ నాయర్ (57) టాప్ స్కోరర్. సాయి సుదర్శన్ (38), శుభ్‌మన్ గిల్ (21), వాషింగ్టన్ సుందర్ (26) ఫర్వాలేదనిపించారు. ఇంగ్లండ్ బౌలర్లలో గస్ అట్కిన్సన్ 5 వికెట్లు పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ దూకుడుగా ఆడింది. ఓపెనర్లు జాక్ క్రాలే, బెన్ డకెట్ బజ్‌బాల్ ఆటను ఆడారు. ఇద్దరు కలిసి 92 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆకాశ్ దీప్ వేసిన అద్భుతమైన బంతికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. అయినా కూడా క్రాలీ వేగంగా పరుగులు రాబడుతూ భారత బౌలర్లను ఒత్తిడి గురిచేస్తున్నారడు.