The Paradise : నేచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న మోస్ట్ హైప్ ఉన్న మూవీ ది ప్యారడైజ్. ఒక్క గ్లింప్స్ తోనే ఇండస్ట్రీలో సెన్సేషన్ అయింది. దసరా మూవీ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో నాని లుక్ చాలా డిఫరెంట్ గా ఉంది. పైగా నాని చేతిమీద ల** కొడుకు అనే పచ్చబొట్టుతో అందరినీ షాక్ కు గురి చేసింది ఆ గ్లింప్స్. ప్రస్తుతం స్పీడ్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి ఈ రోజు సాలీడ్ అప్డేట్ ఇచ్చారు. అందరూ ఊహించినట్టే మూవీని 2026 మార్చి 26న రిలీజ్ చేస్తున్న ఈ రోజు మార్నింగ్ అనౌన్స్ చేశారు. తాజాగా మరో పోస్టర్ ను వదిలారు. ఇప్పుడు వచ్చిన పోస్టర్ లో నాని వందల మంది మధ్యలో కుర్చలో దర్జాగా కూర్చున్నాడు. చుట్టూ వందలాది మంది ఖైదీల డ్రెస్సులో కత్తులతో చంపడానికి చూస్తున్నారు.
Read Also : Vijay Devarakonda : దారి తప్పుతున్న విజయ్ దేవరకొండ నిర్ణయాలు..
ఈ పోస్టర్ చూస్తే నాని రోల్ ఎంత రఫ్ గా ఉంటుందో అర్థం అవుతోంది. భయమన్నది ఎరగని జడల్ పాత్రలో నాని కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ఇందులో నాని లుక్ చాలా డిఫరెంట్ గా ఉంది. రెండు జడలు, ముక్కు పుల్లలతో ఆయన లుక్ అదుర్స్ అన్నట్టే ఉంది. ఇప్పటి వరకు ఇలాంటి లుక్ లో ఏ హీరో కూడా కనిపించలేదేమో. ఇందులో నాని పాత్ర పేరు కూడా జడల్. 1980 ప్రాంతంలో సికింద్రాబాద్ ఏరియాలో జరిగిన కథ ఆధారంగా ఈ సినిమా తీస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు. అసలు కథ ఏంటి అనేది తెలియకున్నా.. కేవలం లుక్ తోనే మూవీ ఓ రేంజ్ లో హైప్ పెంచేస్తోంది. ప్రస్తుతం వైలెంటిక్ సినిమాలతో అలరిస్తున్న నాని.. ఈ సినిమాలో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి.
Read Also : Ashish Vidyarthi : అలాంటి పాత్రలు ఇస్తేనే సినిమాలు చేస్తా.. ఆశిష్ విద్యార్థి కామెంట్స్