Vijay Devarakonda : విజయ్ దేవరకొండకు ఏమైంది.. ఇప్పుడు టాలీవుడ్ లో ఇదే చర్చ జరుగుతోంది. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన వాడు.. మొదట్లో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు చేశాడు. ఏ కథలు ఆడుతాయో ఏరికోరి ఎంచుకుని సెన్సేషన్ అయ్యాడు. పెద్దగా గుర్తింపులేని డైరెక్టర్లతో సినిమాలు చేసినా హిట్లు కొట్టాడు. కానీ ఇప్పుడు ఏమైంది. పెద్ద డైరెక్టర్లు, పెద్ద నిర్మాణ సంస్థలతో చేతులు కలుపుతున్నాడు. కానీ హిట్లు పడట్లేదు. భారీ బడ్జెట్ పెట్టేందుకు ప్రొడక్షన్ సంస్థలు రెడీగా ఉన్నాయి. అయినా డెసిషన్ మేకింగ్ గాడి తప్పుతోంది. ఒకప్పుడు పెద్దగా బడ్జెట్ పెట్టేవారు లేకపోయినా కథలో దమ్మును చూసి విజయ్ సరైన నిర్ణయాలే తీసుకున్నాడు. ఇప్పుడు బడ్జెట్ కు లోటు లేదు. కానీ సరైన కంటెంట్ పడట్లేదు. వరుసగా ప్లాపులే వస్తున్నాయి.
Read Also : War 2 Vs Coolie : నాగార్జునతో ఎన్టీఆర్ కు పోలిక.. ఇదేం ప్రచారం
పాన్ ఇండియా మోజుతో భారీ బడ్జెట్ తో సినిమాలు చేస్తున్నా ఆడట్లేదు. ఇప్పటికే వరుసగా ఆరు ప్లాపులు వచ్చాయి. ఇది ఇలాగే కొనసాగితే విజయ్ కెరీర్ కే భారీ నష్టం. ఎన్నో అంచనాలతో రీసెంట్ గా వచ్చిన కింగ్ డమ్.. పెద్దగా ఆడలేదు. బజ్ తో ఓపెనింగ్స్ తెచ్చుకున్నా.. వారంలోపే చల్లబడిపోయింది. దీంతో తర్వాత చేస్తున్న సినిమాలపై అనుమానాలు పెరుగుతున్నాయి. దిల్ రాజు బ్యానర్ లో ఒకటి, మైత్రీ బ్యానర్ లో ఒక సినిమా చేస్తున్నాడు. ఆ రెండు సినిమా కథలు ఏ స్థాయిలో ఉన్నాయనే దానిపైనే ఇప్పుడు అనుమానాలు పెరుగుతున్నాయి. ఇలా వరుస ప్లాపులు వస్తే మాత్రం విజయ్ పై ఉన్న మినిమమ్ గ్యారెంటీ అనే నమ్మకం పోతుంది. ఈ విషయంలో విజయ్ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. భారీ బడ్జెట్ అనేది పక్కన పెట్టేసి.. కంటెంట్ ఉండే సినిమాలను ఎంచుకుంటే బెటర్ అంటున్నారు ఆయన అభిమానులు.
Read Also : Ashish Vidyarthi : అలాంటి పాత్రలు ఇస్తేనే సినిమాలు చేస్తా.. ఆశిష్ విద్యార్థి కామెంట్స్