Nani: ఈ ఏడాది దసరా సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు నాచురల్ స్టార్ నాని. ఈ సినిమా తర్వాత జోరు పెంచిన నాని ప్రస్తుతం హాయ్ నాన్న సినిమాతో బిజీగా ఉన్నాడు. కొత్త డైరెక్టర్ శౌర్యవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వైరా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి, విజేందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో నాని సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. హాయ్ నాన్న.. డిసెంబర్ 21న రిలీజ్ కి రెడీ అవుతుంది. ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో నాని లుక్ మార్చేశాడు. దసరా సినిమా కోసం పొడువాటి జుట్టు, గుబురు గడ్డం పెంచిన నాని.. హాయ్ నాన్న కోసం క్లీన్ షేవ్ చేసి నాన్న లుక్ లోకి మారిపోయాడు.
Rules Ranjan : రూల్స్ రంజన్ డిజిటల్ హక్కులు పొందిన ప్రముఖ ఓటీటీ సంస్థ..
ఇక ప్రస్తుతం ఈ సినిమా షూట్ పూర్తికావడంతో నాని న్యూ లుక్ లో కనిపించాడు. షార్ట్ హెయిర్ తో కెల్విన్ క్లైన్ హుడీ తో అల్ట్రా స్టైలిష్ లుక్ లో అదరగొట్టాడు. అయితే ఈ లుక్.. కొత్త సినిమా కోసమే అని అభిమానులు చెప్పుకొస్తున్నారు.. అందుతున్న సమాచారం ప్రకారం హాయ్ నాన్న ప్రమోషన్స్ కోసం నాని ఈ విధంగా కనిపించాడని తెలుస్తుంది. ఇక ఈ లుక్ లో నానిని చూసిన అభిమానులు భలే ముద్దొస్తున్నాడే అని కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ సినిమాతో నాని ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి