Rules Ranjan : రూల్స్ రంజన్ డిజిటల్ హక్కులు పొందిన ప్రముఖ ఓటీటీ సంస్థ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన రూల్స్ రంజన్ సినిమా నేడు (అక్టోబర్ 6) థియేటర్లలో విడుదల అయింది. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం సరసన డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది.విడుదలకు ముందే ఈ సినిమాకు పాటలు మరియు ట్రైలర్‌తో మోస్తరు బజ్ క్రియేట్ అయింది… ఈ సినిమాకు రత్నం కృష్ణ దర్శకత్వం వహించారు. రూల్స్ రంజన్ సినిమాలో మెహర్ చాహల్, వెన్నెల కిశోర్, సుబ్బరాజు, హైపర్ అది, వైవా హర్ష, అన్నూ కపూర్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాకు అమ్రీశ్ సంగీతం అందించారు. మురళీ కృష్ణ వేమూరి, దివ్యాంగ్ లవానియా నిర్మించిన ఈ సినిమాను ఏఎం రత్నం సమర్పించారు.మంచి అంచనాల మధ్యే ఈ సినిమా థియేటర్లలోకి వచ్చింది. అయితే, రూల్స్ రంజన్ చిత్రానికి మిక్స్డ్ టాక్ వస్తోంది. కామెడీ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన రూల్స్ రంజన్ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది.
అయితే, రూల్స్ రంజన్‍లో హీరోయిన్ నేహాశెట్టి పర్ఫార్మెన్స్, గ్లామర్ షోపై మాత్రం ప్రశంసలు వస్తున్నాయి. కిరణ్ – నేహా మధ్య కెమెస్ట్రీ బాగా కుదిరింది. అయితే, కథ, కథనం విషయంలో మాత్రం ఈ సినిమాపై నెగటివ్ టాక్ వినిపిస్తుంది.ఇదిలా ఉంటే రూల్స్ రంజన్ సినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్ ఫిక్స్ అయింది.ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. మంచి రేటుకే ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ సొంతం చేసుకుందని సమాచారం.. నవంబర్ తొలి వారంలో రూల్స్ రంజన్ సినిమాను స్ట్రీమింగ్‍కు తీసుకురావాలని ముందుగా నిర్ణయించారని తెలుస్తుంది ఈ చిత్రానికి టాక్ ఆశించిన స్థాయిలో టాక్ రాకపోవటంతో అనుకున్న దాని కంటే ముందే ఈ చిత్రానికి స్ట్రీమింగ్‍కు తీసుకురావాలనే ఆలోచన ఉందని తెలుస్తుంది.అక్టోబర్ మూడో వారంలోనే రూల్స్ రంజన్ సినిమా ఓటీటీలో స్ట్రీమ్ కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read
- Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
- Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
- YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
- OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
తాజావార్తలు
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్‌ఫర్డ్‌కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్‌లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!