Nani30: దసరా సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు న్యాచురల్ స్టార్ నాని. ఈ సినిమా ఇచ్చిన జోష్ తో వరుస సినిమాలను లైన్లో పెట్టిన నాని.. ప్రస్తుతం నాని 30 ను పట్టాలెక్కించాడు. కొత్త దర్శకుడు శౌర్యవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నాని సరసన మృణాల్ ఠాకూర్ నటిస్తోంది. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ పూర్తిచేసుకుంటున్న ఈ సినిమా గురించిన ఒక అప్డేట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. కొత్త కథలను ఎప్పుడు ఎంకరేజ్ చేసే నాని.. ఈసారి కూడా మరో కొత్త కథతో రానున్నాడు. నాని 30.. ఒక చిన్నారి కథ అని తెలుస్తోంది. చిన్నతనంలోనే గొడవలతో తల్లిదండ్రులు విడిపోతే ఆ చిన్నారి పడే బాధ ఎలా ఉంటుంది అనేది ఎంతో హృద్యంగా చూపించనున్నారట. ఇక నాని, మృణాల్ భార్యాభర్తలుగా కనిపించనున్నారు.
Ileana: ఇలియానా బిడ్డకు తండ్రి అతనే..?
నాని, నాన్నగా నటించడం ఇది రెండోసారి.. జెర్సీలో కూడా తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో చూపించాడు. ఇక ఇందులో మరోసారి ఆ ప్రేమను చూపించనున్నాడు. ఇక అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు ‘హాయ్ .. నాన్న’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్, అనుష్క నటించిన నాన్న సినిమా గుర్తిందిగా.. ముందు నాన్న అనే టైటిల్ నే ఫిక్స్ చేసినా మళ్లీ విక్రమ్ సినిమా గుర్తొస్తుంది అని దానికి హాయ్ అని యాడ్ చేసినట్లు సమాచారం. తల్లి దగ్గర పెరిగే కూతురు.. ప్రేమకోసం ఒక తండ్రి.. తండ్రి ప్రేమ కోసం ఒక కూతురు పడే వేదనను చూపించబోతున్నారట. మరి ఈ సినిమాతో నాని ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.